Samsung Launches Galaxy Z Fold 7 Enterprise Edition with 200MP Camera, AI Tools and Extended Security for Corporate Users
- కార్పొరేట్ అవసరాల కోసం శాంసంగ్ నుంచి కొత్త ఫోల్డబుల్ మొబైల్
- అనేక AI ఫీచర్లు అందుబాటులో
- 8 అంగుళాల QXGA+ Dynamic AMOLED 2X ఫోల్డబుల్ మైన్ డిస్‌ప్లే
- జెట్ బ్లాక్ కలర్‌లో మాత్రమే అందుబాటులో.

Samsung Galaxy Z Fold 7 Enterprise Edition: శాంసంగ్ తన ఫోల్డబుల్ ఫోన్ లైనప్‌లో భాగంగా కొత్తగా Galaxy Z Fold 7 Enterprise Edition మోడల్‌ను జర్మనీలో లాంచ్ చేసింది. ఈ ఎడిషన్‌ను ప్రత్యేకంగా కార్పొరేట్ సంస్థలు, సంస్థాగత అవసరాల కోసం రూపొందించారు. ఇది స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉన్నా, కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు అలాగే అడిషనల్ సెక్యూరిటీ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. మరి స్పెషల్ ఏదితిఒన్ వివరాలను ఒకసారి చూసేద్దామా..
Galaxy Z Fold 7 ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ ప్రస్తుతం శాంసంగ్ జర్మనీ వెబ్‌సైట్‌లో జెట్ బ్లాక్ కలర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది 512GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లభ్యమవుతుంది. దీని ధర ఇంకా వెల్లడించనప్పటికీ, ఇది సాధారణంగా కార్పొరేట్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్టాండర్డ్ Z Fold 7 మోడల్‌తో పోల్చితే, ఈ ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్‌కు 3 సంవత్సరాల పొడిగించిన వారంటీ లభిస్తుంది. అదేవిధంగా, Samsung Knox Suite అనే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ టూల్‌ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందిస్తుంది. ఈ టూల్ ద్వారా సంస్థలు ఫోన్‌లను మెరుగైన భద్రతతో నిర్వహించవచ్చు.
Nikki haley: భారత్‌తో సంబంధాలు చెడగొట్టుకోవద్దు.. అధ్యక్షుడుకి సొంత పార్టీ నేత స్వీట్ వార్నింగ్!
ఈ మొబైల్ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో ప్యాక్ తో వస్తుంది. Galaxy Z Fold 7 ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ లో 8 అంగుళాల QXGA+ Dynamic AMOLED 2X ఫోల్డబుల్ మైన్ డిస్‌ప్లే ఉంటుంది. రిఫ్రెష్ రేట్ 120Hz, బ్రైట్నెస్ 2600 నిట్స్ వరకు ఉంటుంది. అలాగే కవర్ డిస్‌ప్లే 6.5 అంగుళాల Full HD+ AMOLED స్క్రీన్‌తో వస్తుంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 ప్రొటెక్షన్ ఉంది. అలాగే ఈ ఫోన్‌లో Snapdragon 8 Elite for Galaxy చిప్‌సెట్ ఉపయోగించబడింది. ఇది Android 16 ఆధారిత One UI 8 తో వస్తోంది. Pixel 10 సిరీస్‌కు ముందు, ఈ ఫోన్ Android 16తో వస్తున్న మొదటి మోడళ్లలో ఒకటిగా నిలిచింది.
ఇక కెమెరా సెటప్ విషయం చూస్తే ఇది ప్రీమియం కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 200MP ప్రైమరీ కెమెరా (OISతో), 12MP అల్ట్రావైడ్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్).. దీనితో పాటు రెండు 10MP సెల్ఫీ కెమెరాలు (ఒకటి లోపల, మరొకటి కవర్ డిస్‌ప్లేపై) ఉన్నాయి. ఇక బ్యాటరీ, చార్జింగ్, బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే.. 4,400mAh బ్యాటరీ లభిస్తుండగా.. 25W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ 2.0, వైర్లెస్ పవర్‌షేర్ లభిస్తుంది. ఇక ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్, ఫ్లెక్స్ హింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Victus 2 లతో బిల్డ్ క్వాలిటీ ఉంది. అలాగే రెయిన్, డస్ట్ ప్రొటెక్షన్ కోసం IP48 రేటింగ్ ఉంది.
Ravi Teja : రోత పుట్టించిన మాస్ జాతర ఫస్ట్ సింగిల్.. టూ మచ్
ఇక ఈ మొబైల్ లో అనేక AI ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ AI Results View, Drawing Assist, Writing Assist, Google Circle to Search వంటి AI ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. అలాగే Google Gemini Live సహాయంతో మరింత స్మార్ట్ యూజర్ ఇంటరాక్షన్‌ను కలిగి ఉంటుంది. మొబైల్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కలిగి ఉంది. మొత్తంగా Samsung Galaxy Z Fold 7 Enterprise Edition కార్పొరేట్ సంస్థలకు ఓ మంచి ఫోల్డబుల్ ఫోన్ ఎంపికగా నిలవనుంది. అప్డేటెడ్ స్పెసిఫికేషన్లు, పొడిగించిన వారంటీ, ఉచిత Knox స్యూట్ లాంటి ఫీచర్లతో ఇది ఎంటర్‌ప్రైజ్ యూజర్ల అవసరాలను తీరుస్తుంది.