
Samsung Galaxy S25 FE: శాంసంగ్ తన పాపులర్ ‘S’ సిరీస్‌లో భాగంగా Galaxy S25 FE ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనుందని అధికారికంగా ధృవీకరించింది. తాజా లీక్‌ల ప్రకారం, ఈ ఫోన్ విడుదల తేదీ, ముఖ్యమైన ఫీచర్లు, రంగు ఎంపికలు, ధర అంచనాలు వంటి వివరాలు బయటకు వచ్చాయి. S24 FE కంటే ముందుగానే ఈ కొత్త మోడల్ మార్కెట్లోకి రానుందని సమాచారం. కొరియా సంబంధిత ఓ నివేదిక ప్రకారం Galaxy S25 FE ఫోన్ సెప్టెంబర్ 19న దక్షిణ కొరియాలో లాంచ్ కానుంది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అదేరోజు లేదా కొద్దిగా ఆలస్యంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన S24 FE కు అప్డేటెడ్ వర్షన్.
Vijay Deverakonda : బాక్సాఫీస్ హిట్ కొట్టిన .. విజయ్ కి తప్పని తిప్పలు
ఇకపోతే ఈ శాంసంగ్ గాలక్సీ S25 FE ఫోన్ ధర 1 మిలియన్ కొరియన్ వాన్ (సుమారు 63,200) లోపు ఉండే అవకాశం ఉందని లీక్ లో పేర్కొంది. ఇది S సిరీస్‌కి అడ్వాన్స్డ్ ఫీచర్లను అందించడంతోపాటు ఫ్లాగ్‌షిప్ స్థాయిలో కాకుండా తక్కువ ఖర్చుతో మిడ్-హై రేంజ్ యూజర్లను లక్ష్యంగా చేస్తుంది. ఇక ఈ Galaxy S25 FE ఫోన్ ను శాంసంగ్ లైట్ బ్లూ, డార్క్ బ్లూ, బ్లాక్, వైట్ అనే నాలుగు రంగులలో విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇక RAM, స్టోరేజ్ వేరియంట్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో రానున్నట్లు తెలుస్తోంది. 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 256GB స్టోరేజ్ తో రావచ్చు. ఇక మంచి పనితీరు కోసం ఈ ఫోన్‌లో Exynos 2400 చిప్‌సెట్ వాడనున్నారని లీక్‌లు వెల్లడించాయి. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8తో ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా వస్తుంది. ఇక ఈ Galaxy S25 FE ఫోన్‌లో.. 6.7-అంగుళాల Full HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ Victus+ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ స్పెసిఫికేషన్లు వీడియో, గేమింగ్, స్క్రోల్ అనుభూతి పరంగా స్మూత్ గా ఉండేలా చేస్తాయి.
Samsung Galaxy Z Fold 7 Enterprise Edition: 200MP కెమెరా, AI ఫీచర్లు, హై సెక్యూరిటీ… కార్పొరేట్ అవసరాల కోసం శాంసంగ్ నుంచి కొత్త ఫోల్డబుల్ మొబైల్!
ఇక ఈ ఫోన్‌లో ఉన్న కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇందులో ట్రిపుల్ కెమెరా సెట్ ను అందంచనున్నారు. 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 8MP టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్).. అలాగే ముందుభాగంలో 12MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇది వీడియో కాల్స్, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు బాగా ఉపయోగపడుతుంది. ఇక ఇందులో 4,900mAh బ్యాటరీ, 45W సపోర్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభించనుంది. గతేడాది విదుదలైన S24 FE 4,700mAh బ్యాటరీతో 25W ఛార్జింగ్ ఇచ్చింది. తాజా మోడల్‌లో మరింత వేగవంతమైన ఛార్జింగ్, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం లభించనుంది.