Leading News Portal in Telugu

Best Budget Smartphones to Gift Your Sister This Raksha Bandhan.. Stylish, Useful Under 10000 Only


Best Budget Smartphones: రక్షా బంధన్ నాడు సోదరీమణులకు ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ బెస్ట్ బడ్జెట్ ఫోన్స్ ట్రై చేయండి!

Best Budget Smartphones: ప్రతి ఏడాది రాఖీ పండుగ రాగానే అక్కతమ్ముడు, అన్నచెల్లెళ్ల మధ్య ప్రేమ, బంధం మరింత బలపడుతుంది. ఈ ప్రత్యేక రోజున మీ సోదరి కోసం ఒక విలువైన, ఉపయోగకరమైన గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారా? అలాంటప్పుడు ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కంటే మంచి ఎంపిక మరొకటి ఉండదు. కాబట్టి ఈ రాఖీ పండుగను మరింత అందంగా మార్చడానికి, మీ చెల్లెలు కోసం బడ్జెట్‌కు అనుగుణంగా ఉన్న ఉత్తమ మొబైల్స్‌ను గిఫ్ట్ చేయండి. చదువు, ఎంటర్టైన్‌మెంట్, సోషల్ మీడియా, వీడియో కాల్స్ అన్ని అవసరాలకు పనికొచ్చేలా ఈ ఫోన్లను ఇవ్వడానికి ట్రై చేయండి. స్టైలిష్ డిజైన్‌తో పాటు మంచి కెమెరా, లాంగ్ బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో మీ గిఫ్ట్ మరపురాని గుర్తుగా మిగిలిపోతుంది. మరి 10,000 లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ మొబైల్స్ వివరాలు ఒకసారి చూసేద్దామా..

Samsung Galaxy S25 FE: విడుదలకు ముందే ఫీచర్లు లీక్.. పవర్‌ఫుల్ ఫీచర్లతో బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్!

Realme Narzo N53:
ఈ ఫోన్ 6.74 అంగుళాల HD+ డిస్ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఇందులో Unisoc T612 ప్రాసెసర్ ఉండటం వల్ల డే టు డే యూజ్‌కు మంచి పనితీరు ఇస్తుంది. 4GB/6GB ర్యామ్, 64GB/128GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 50MP వెనుక కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో ఫోటో క్వాలిటీ బాగుంటుంది. 5000mAh బ్యాటరీతో పాటు 33W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కలదు. దీని ధర రూ.8,999 మాత్రమే. ఈ ఫోన్ స్టైలిష్ డిజైన్, వేగవంతమైన ఛార్జింగ్, డైలీ యూజ్‌కి బాగా పనికొచ్చేలా ఉంటుంది.
Image (17)

Infinix Smart 8 Plus:
ఈ ఫోన్ మెడియాటెక్ Helio G36 ప్రాసెసర్‌తో వస్తుంది. 4GB ఫిజికల్ RAMతో పాటు 4GB వర్చువల్ RAM సపోర్ట్ ఉంటుంది. అలాగే 6.6 అంగుళాల HD+ డిస్ప్లేలో 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది. కెమెరా విభాగంలో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలాగే ఇందులో భారీగా 6000mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. దీని ధర 6,999 నుండి 7,499 మధ్యలో ఉంటుంది. ఈ ఫోన్ ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్‌ కోసం చూస్తున్నవారికి, స్టూడెంట్స్‌కి పర్ఫెక్ట్ ఆప్షన్.

Fake ED Officers: ఈడీ అధికారుల దారి దోపిడీ.. 70 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు..

Image (18)

Lava Blaze 5G:
సాదారణంగా 5G ఫోన్లు ఈ ధరకు దొరకడం చాలా కష్టం. కానీ Lava Blaze 5G ఒక బడ్జెట్ 5G మొబైల్. ఇది Dimensity 6020 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ మొబైల్ 4GB లేదా 6GB RAM వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇందులో 6.5 అంగుళాల HD+ డిస్ప్లేలో 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది. 50MP రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 5000mAh ఉండి, 18W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ.9,999గా ఉంది. స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవంతో పాటు స్మూత్ యూజర్ ఇంటర్‌ఫేస్, మంచి గేమింగ్ పెర్ఫార్మెన్స్ కోసం ఇది ఉత్తమ ఎంపిక.

Image (19)

POCO C61:
ఈ ఫోన్ MediaTek G36 ప్రాసెసర్‌తో వస్తుంది. 4GB RAM + 4GB వర్చువల్ RAM కలిపి మొత్తం 8GB వరకూ RAM లా పని చేస్తుంది. 6.71 అంగుళాల HD+ డిస్ప్లేతో పెద్ద స్క్రీన్ అనుభూతి ఇస్తుంది. కెమెరా విభాగంలో 8MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ 5000mAh ఉంటుంది. దీని ధర కేవలం రూ.6,999 మాత్రమే. పెద్ద స్క్రీన్, మంచి బ్యాటరీ బ్యాకప్ ఉండే మొబైల్ కోసం చూస్తున్నవారికి ఇది బాగా పనికి వస్తుంది.

Image (20)