iPhone 17 Series Launching on September 9.. Major Camera Upgrades, New Design and Higher Price for Pro Models
- ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్..
- ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబరు 9న విడుదల?
- ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 12న మొదలు..
- నివేదికలు ఏమంటున్నాయంటే?

iPhone 17: ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్. టెక్ ప్రపంచాన్ని ఉర్రూతలూ ఊగించే అతి పెద్ద ఈవెంట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. దీని కారణం.. ఆపిల్ సంస్థ ఐఫోన్ 17 సిరీస్‌ను సెప్టెంబరు 9న విడుదల చేయనున్నట్లు తాజా లీక్. ఆ రోజు జరిగే ఈవెంట్ లో iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro, iPhone 17 Pro Max వేరియంట్లు విడుదల కబుతూంట్లు సమాచారం. కాకపోతే ఇప్పుడు అందరి దృష్టి ఐఫోన్ 17 సిరీస్ ప్రో మోడళ్లపైనే ఉంది. ఎందుకంటే ఎక్కువ అధునాతన ఫీచర్లతో వస్తున్నాయి. ఇకపోతే, అందిన నివేదికల ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో సిరీస్‌ను ఆపిల్ సెప్టెంబర్ 9 (మంగళవారం)న ఆవిష్కరించనుంది. అలాగే వాటికీ సంబంధించి ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 12న మొదలవవచ్చు. ఇక వాటి డెలివరీలు, విక్రయాలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం.
Gold Rate Today: ఆగని పసిడి పరుగు.. కొనాలంటే కష్టమే! నేటి గోల్డ్ రేట్స్ ఇలా
ఇక మరో నివేదిక ప్రకారం, ఈసారి ప్రో మోడళ్ల ధరల్లో 50 డాల్లర్స్ పెరుగుతుందని పేర్కొన్నారు. దీనితో iPhone 17 Pro మోడల్ 1,049 డాలర్స్ (సుమారు రూ.87,000), iPhone 17 Pro Max మోడల్ 1,249 డాలర్స్ (సుమారు రూ.1,03,000) ఉండనున్నట్లు పేర్కొంది. ఇది ఇలా ఉండగా కెమెరా విభాగంలో విప్లవాత్మక మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 17 ప్రో సిరీస్‌కి పెద్ద కెమెరా బార్ ఉండే అవకాశం ఉందని సమాచారం. దీని వల్ల ఫోన్ పరిమాణం 8.725mm దాకా పెరుగుతుందని తెలుస్తోంది. ఇందులో 48MP టెలిఫోటో కెమెరా (ఇంతకుముందు 12MP), 24MP ఫ్రంట్ కెమెరా (వెనుక/front రెండింటినీ ఒకేసారి వీడియో రికార్డింగ్‌కు మద్దతు), 8K వీడియో రికార్డింగ్, 8x ఆప్టికల్ జూమ్, ప్రొ-గ్రేడ్ కెమెరా యాప్ ఉంటూ కొత్తగా కెమెరా కంట్రోల్ బటన్ ప్రత్యేకంగా రావచ్చుని నివేదికలు తెలుపుతున్నాయి.
RBI REPO Rate: రెపో రేటులో మార్పు లేదు.. ఆర్బీఐ కీలక ప్రకటన!
ఇక డిజైన్, హార్డ్వేర్ అప్‌గ్రేడ్స్ విషయానికి వస్తే.. ఇందులో టైటానియం బదులు అల్యూమినియం ఫ్రేమ్, బ్యాక్ ప్యానెల్‌లో గ్లాస్+అల్యూమినియం మిక్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్స్ మ్యాట్ ఫినిష్‌తో యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే, A19 Pro చిప్, 12GB RAM, Apple Wi-Fi 7 చిప్, iPhone 17 Pro Maxలో 5000mAh+ బ్యాటరీ, ఫాస్ట్ MagSafe ఛార్జింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్, eSIM మాత్రమే ఉండనున్నట్లు లీక్స్ పేర్కొన్నాయి. iPhone 17 Pro, Pro Max వేరియంట్లు బ్లాక్, డార్క్ బ్లూ, వైట్, ఆరెంజ్ అనే నాలుగు స్పెషల్ రావొచ్చు.