Leading News Portal in Telugu

Apple releases iOS 26 beta 5 update


  • ఆపిల్ iOS 26 బీటా 5 అప్‌డేట్‌ విడుదల
  • ప్రధాన హైలైట్ “లిక్విడ్ గ్లాస్” డిజైన్
iOS 26 Beta: ఆపిల్ iOS 26 బీటా 5 అప్‌డేట్‌ విడుదల.. ప్రధాన హైలైట్ “లిక్విడ్ గ్లాస్” డిజైన్

ఆపిల్ సంస్థ తమ తాజా ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 26ని WWDC 2025లో పరిచయం చేసింది. ఈ అప్‌డేట్ iOS 7 తర్వాత ఆపిల్ తీసుకొచ్చిన అతిపెద్ద డిజైన్ ఓవర్‌హాల్‌గా పరిగణిస్తున్నారు. ఇప్పుడు iOS 26 పబ్లిక్ బీటా విడుదలైంది. ఆపిల్ తన మిలియన్ల మంది iOS 26 వినియోగదారుల కోసం మరోసారి డెవలపర్ బీటా 5 అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్ ప్రస్తుతం డెవలపర్లు, బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

iOS 26 అనేది ఆపిల్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్. ఇది 2025 సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు అధికారికంగా విడుదల కానుంది. ఈ అప్‌డేట్‌లో ప్రధాన హైలైట్ “లిక్విడ్ గ్లాస్” డిజైన్. ఇది ఐఫోన్ ఇంటర్‌ఫేస్‌కు సరికొత్త రూపాన్ని అందిస్తుంది. ఈ డిజైన్ ట్రాన్స్‌లూసెంట్ ఎలిమెంట్స్‌తో, గ్లాస్‌లా కనిపించే ఐకాన్‌లు, విడ్జెట్‌లు, నావిగేషన్ బార్‌లు, మెనూలను అందిస్తుంది. ఇవి కంటెంట్‌పై ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తాయి. లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్, యాప్ ఐకాన్‌లు, సిస్టమ్ నావిగేషన్‌లో ట్రాన్స్‌లూసెంట్ ఎఫెక్ట్‌లతో కూడిన కొత్త డిజైన్ లాంగ్వేజ్. ఈ డిజైన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మరింత ఆధునికంగా, ఆకర్షణీయంగా మారుస్తుంది.

కొత్త అప్‌డేట్ తర్వాత, ఐఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు డైనమిక్ ఐలాండ్‌లో అలర్ట్ కనిపిస్తుంది. అదే సమయంలో, లాక్ స్క్రీన్‌లో పాస్‌కోడ్‌ను ఎంటర్ చేసేటప్పుడు కొత్త యానిమేషన్ కూడా యాడ్ అవుతుంది. దీనితో పాటు, అప్‌డేట్‌లో కొన్ని చిన్న మార్పులు కూడా చేర్చారు. ఇందులో ఆపిల్ యాప్‌ల కోసం కొత్త స్ప్లాష్ స్క్రీన్‌లు, విస్తృత హోమ్ స్క్రీన్ డాక్, కొత్త కంట్రోల్ సెంటర్ యానిమేషన్ ఉన్నాయి. ఆపిల్ ఐఫోన్ కోసం iOS 26 బీటా 5 అప్‌డేట్‌ను 23A5308g బిల్డ్ నంబర్‌తో విడుదల చేసింది. అయితే, అప్‌డేట్ తర్వాత, లాక్ స్క్రీన్ పాస్‌కోడ్‌ను నమోదు చేసిన తర్వాత ఐఫోన్‌లో కొత్త యానిమేషన్ కనిపిస్తుందని తెలిసింది. దీనితో పాటు, కంట్రోల్ సెంటర్ యానిమేషన్ కూడా మార్చింది. ఇది కాకుండా, స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు పేజీలు బౌన్స్ అవుతాయి. కంట్రోల్ సెంటర్‌లోని Wi-Fi టోగుల్‌ను ఎక్కువసేపు నొక్కితే, ఆ నెట్‌వర్క్ ప్రైవేట్ లేదా పబ్లిక్ కు చెందినదా అనేది తెలుస్తుంది.

iOS 26 అన్ని ఐఫోన్‌లకు అందుబాటులో ఉండదు. ఈ అప్‌డేట్ ఐఫోన్ 11, తదుపరి మోడల్‌లకు సపోర్ట్ చేస్తుంది.

ఐఫోన్ 11, 11 ప్రో, 11 ప్రో మాక్స్
ఐఫోన్ 12, 12 మినీ, 12 ప్రో, 12 ప్రో మాక్స్
ఐఫోన్ 13, 13 మినీ, 13 ప్రో, 13 ప్రో మాక్స్
ఐఫోన్ 14, 14 ప్లస్, 14 ప్రో, 14 ప్రో మాక్స్
ఐఫోన్ 15, 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో మాక్స్
ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మాక్స్, 16e
ఐఫోన్ SE (2వ తరం మరియు తదుపరి)
ఐఫోన్ 17 సిరీస్ (సెప్టెంబర్ 2025లో విడుదల కానుంది)