
Grok Spicy Mode: ఎలాన్ మస్క్‌కు చెందిన x సంస్థ తాజాగా విడుదల చేసిన ‘Grok Imagine’ ఫీచర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ మల్టీమోడల్ టూల్ ద్వారా యూజర్లు టెక్స్ట్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి ఇమేజెస్, వీడియోలు సృష్టించవచ్చు. దీనిలో ఇందులో చర్చనీయాంశంగా మారుతుంది “Spicy Mode” అనే ప్రత్యేక సెట్టింగ్.
Tragic Incident: గాల్లో ఆగిపోయిన గల్ఫ్ కార్మికుని గుండె.. నేడు కోరుట్లకు మృతదేహం!
ఇకపోతే ఈ Grok Imagine ప్రస్తుతం iOS యాప్‌లో SuperGrok గా, Premium+ X సబ్‌స్క్రైబర్లకు బీటా వెర్షన్ రూపంలో అందుబాటులో ఉంది. ఈ టూల్ ద్వారా టెక్స్ట్ ప్రాంప్ట్‌లతో ఇమేజెస్, ఇమేజ్‌ల నుంచి వీడియోల రూపకల్పన చేయవచ్చు. ఇందులో వీడియోల పరిమితి గరిష్టంగా 15 సెకన్లు ఉంటుంది. వీటికి ఆడియో జతచేసే ఆప్షన్ తో వస్తోంది. ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే.. Google Veo 3 తరువాత ఇది ఆడియోతో వీడియోలు రూపొందించే AI టూల్. ప్రతి వినియోగదారుని ఆకట్టుకునే విధంగా Grok Imagine టూల్‌లో 4 మోడ్‌లు ఉన్నాయి. అవే.. కస్టమ్ మోడ్, నార్మల్ మోడ్, ఫన్ మోడ్, స్పైసి మోడ్.
Vizag: ఆరుగురు ప్రతివ్రతలు అరెస్ట్.. పేకాట ఆడుతున్న భార్యపై ఫిర్యాదుతో గుట్టురట్టు!
ఇది ఇలా ఉండగా Spicy Mode గురించి వినగానే నెటిజన్ల మధ్య ఆసక్తి, చర్చలు పెరిగిపోయాయి. ఈ మోడ్ explicit, NSFW (Not Safe For Work) కంటెంట్ సృష్టించే సామర్థ్యం కలిగి ఉంది. వీటి ద్వారా కొన్ని ఇమేజెస్‌లో నగ్నత కనిపించకపోయినా, ఊహించడానికి ఇక చాలా తక్కువ మిగిలి ఉందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మోడ్ వివాదాస్పదమైనదిగా మారడంతో పాటు, నెటిజన్స్ అసలు ఈ ఆప్షన్ ఎలా పనిచేస్తుందన్న విషయంపై తెగ ఉత్సహం చూపిస్తున్నారు. ప్రధానంగా ఇతర AI టూల్స్‌తో తేడా ఏమిటన్న విషయానికి వస్తే.. Grok Imagine తక్కువ నియంత్రణతో NSFW కంటెంట్ అందించగలగడం, ChatGPT, Gemini, Claude లాంటి ఇతర మేన్స్‌స్ట్రీమ్ టూల్స్‌కు పూర్తి విరుద్ధంగా ఉంది. మిగి వాటి వద్ద కంటెంట్ సంబంధించి గట్టి నియంత్రణలు, ఫిల్టర్లు ఉండగా.. Grok Imagine మాత్రం స్పష్టంగా మరో మార్గాన్ని ఎంచుకుంది. ఎలాన్ మస్క్ ప్రకారం, ఈ ఫీచర్ ప్రారంభమైన రెండు రోజుల్లోనే 3.4 కోట్ల ఇమేజెస్ Grok ద్వారా రూపొందించబడ్డాయి.