Leading News Portal in Telugu

Samsung Launches Galaxy A17 5G with FHD+ AMOLED Display, Exynos 1330, Android 15 and 50MP Camera


  • Samsung Galaxy A17 5G లాంచ్.
  • 6.7-అంగుళాల Super AMOLED ఫుల్ HD+ డిస్ప్లే
  • IP54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్
  • 50MP ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో లెన్స్ 13MP సెల్ఫీ కెమెరా.
Samsung Galaxy A17 5G: మిడ్‌రేంజ్‌లో మాస్ అట్రాక్షన్.. స్టైల్, స్పీడ్, స్మార్ట్‌నెస్‌ అన్నీ కలిపి శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్!

Samsung Galaxy A17 5G: శాంసంగ్ (Samsung) తాజాగా తన గాలక్సీ A సిరీస్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అదే Samsung Galaxy A17 5G. ఇది గతంలో వచ్చిన Galaxy A16 5Gకి అప్డేటెడ్ వర్షన్. సరికొత్త ఫీచర్లు, మంచి ప్రాసెసర్ పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్‌తో యూజర్లను ఆకట్టుకునేలా ఈ ఫోన్ ను రూపొందించారు. మరి ఈ కొత్త మొబైల్ విశేషాలను ఒకసారి చూసేద్దామా..

డిజైన్ అండ్ డిస్‌ప్లే విషయానికొస్తే.. Galaxy A17 5G 6.7-అంగుళాల Super AMOLED ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో విజువల్స్ మరింత స్మూత్‌గా కనిపిస్తాయి. Infinity-U కట్‌తో ఉన్న డిస్‌ప్లే, యూజర్‌కు మంచి వీక్షించే అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్‌కు IP54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. అంటే ఇది కొంతమేరకు నీటి చుక్కలు పడ్డా, దుమ్ము నుండి కూడా రక్షణ కల్పిస్తుంది.

Motorola: గ్లామర్ టచ్ తీసుకొస్తున్న మోటరోలా.. కొత్త బ్రిలియంట్ ఎడిషన్ అనౌన్స్!

 

Image (5)

ప్రాసెసర్ అండ్ సాఫ్ట్‌వేర్ విషయంలో ఇది 5nm ఆధారిత Exynos 1330 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తోంది. ఇది Mali-G68 MP2 GPUతో జతచేయబడి ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7తో రన్ అవుతుంది. ర్యామ్ పరంగా ఈ మొబైల్ 4GB, 6GB, 8GB వేరియంట్లలో లభించనుండగా.. స్టోరేజ్ 128GB, 256GBగా అందుబాటులో ఉంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఫోటో ప్రియుల కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇందులో అందించబడింది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా (f/1.8 అపీచర్, ఆटोఫోకస్‌తో), 2MP మ్యాక్రో లెన్స్ (f/2.2) ఉన్నాయి. ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా (f/2.0) ఉంది. ఇది వీడియో కాల్స్, సెల్ఫీలకు అనుకూలంగా డిజైన్ చేయబడింది.

Image (6)

బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయంలో, Galaxy A17 5G లో 5,000mAh సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంది. ఇది 25W ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతిస్తుంది. దీని వల్ల రోజువారీ పనులకు నిరంతర వినియోగం సాధ్యమవుతుంది.

Trupm-Putin: వచ్చే వారం ట్రంప్-పుతిన్ ప్రత్యక్ష భేటీ.. జెలెన్‌స్కీ కూడా హాజరయ్యే ఛాన్స్

ఇతర ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 5, Bluetooth 5.3, USB Type-C పోర్ట్ ఉన్నాయి. ఈ మొబైల్ పరిమాణం 164.4 x 77.9 x 7.5mm కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.

ధర విషయానికి వస్తే.. యూరప్ మార్కెట్‌లో దీని ప్రారంభ ధర 239 యూరోస్ (సుమారు 24,000) గా ఉంది. ఇది బ్లాక్, బ్లూ, గ్రే రంగుల్లో శాంసంగ్ స్టోర్ లో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. భారత మార్కెట్‌కు సంబంధించి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

మొత్తంగా, Galaxy A17 5G మిడ్రేంజ్‌లో స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఫీచర్లు, మల్టీటాస్కింగ్ సామర్థ్యంతో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా రూపొందించబడింది.