Motorola x Swarovski Unveil ‘The Brilliant Collection’.. Sparkling Razr 60 Flip Phone and Moto Buds Loop in Limited Edition Glam

Motorola: టెక్నాలజీకి కాస్త ఫ్యాషన్ టచ్ ఇస్తూ.. మోటరోలా తన ప్రముఖ ఫ్లిప్‌ఫోన్ రేజర్ 60, మోటో బడ్స్ లూప్ ను స్వరోవ్స్కీ (Swarovski) బ్రాండ్ తో కలిసి ప్రత్యేకంగా తయారు చేసింది. ఈ కొత్త ఎడిషన్‌ను “The Brilliant Collection” పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ బ్రిలియంట్ కలెక్షన్ లో ఫోను, ఈయర్‌బడ్స్ రెండూ పాన్టోన్ ఐస్ మెల్ట్ కలర్ వేరియంట్ లో లభ్యమవుతుంది . అంతేకాకుండా.. ప్రతి డివైస్‌పై Swarovski క్రిస్టల్స్ ను చేతితో అమర్చారు.
ఇక ప్రత్యేకతల విషయానికి వస్తే.. మోటరోలా రేజర్ 60 పై 35 స్వరోవ్స్కీ క్రిస్టల్స్ ను చేతితో అమర్చారు. ఇందులో హింజ్ పై ఉన్న 26-ఫెసెట్ క్రిస్టల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే వాల్యూమ్ బటన్స్ కూడా క్రిస్టల్ ఇన్‌స్పైర్డ్ డిజైన్ తో అందంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మొబైల్ ను క్యారీ చేయడానికి క్రాస్‌బాడీ బ్యాగ్ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అలాగే మోటో బడ్స్ లూప్ కూడా గోల్డ్ అంచులతో కూడిన జ్యువెలరీలా కనిపించేలా డిజైన్ చేశారు. ఇవి కూడా Swarovski డెకరేషన్ తో వస్తున్నాయి.
Investment Tips: ఎలాంటి రాజీపడకుండానే 20 ఏళ్లలో రూ.2 కోట్ల రూపాయలని ఎలా సంపాదించవచ్చంటే?
ఈ బ్రిలియంట్ కలెక్షన్ బండిల్ అమెరికాలో 999 డాలర్స్ అంటే (సుమారు 87,000) ధరకు లభ్యమవుతుంది. ఇందులో రేజర్ 60 + మోటో బడ్స్ లూప్ (Special Edition) ఉంటాయి. ఇది August 7 నుంచి మోటోరోలా వెబ్సైటు ద్వారా లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల అవుతుంది. భారత్ సహా ఇతర మార్కెట్లకు సంబంధించిన ధరలు, లభ్యత వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు మోటరోలా తెలిపింది.
మోటరోలా రేజర్ 60 స్పెసిఫికేషన్స్ (అంచనా):
* ప్రధాన డిస్‌ప్లే: 6.9-అంగుళాల P-OLED ఫుల్ HD+
* కవర్ స్క్రీన్: 3.6-అంగుళాల P-OLED
* ప్రాసెసర్: MediaTek Dimensity 7400X SoC
* కెమెరా సెటప్: 50MP (ప్రైమరీ) + 13MP (అల్ట్రావైడ్), 32MP సెల్ఫీ కెమెరా
* బ్యాటరీ: 4500mAh
TDP vs YSRCP Clash: పులివెందుల వైసీపీ నేతలపై దాడి ఘటనలో 25 మందిపై కేసు..
మోటో బడ్స్ లూప్:
* Bose ట్యూనింగ్ తో అధిక నాణ్యత గల ఆడియో.
* ఓపెన్-ఇయర్ డిజైన్, సౌకర్యవంతమైన ధరించే విధానం.
* ఫ్యాషన్ స్టేట్‌మెంట్ లా కనిపించేలా Swarovski డిజైన్.