Leading News Portal in Telugu

Google AI Pro: Free for Students! One-Year Subscription at No Cost.. But?


  • విద్యార్థులకు శుభవార్త.
  • ఏడాదిపాటు గూగుల్ AI ప్రో ప్లాన్ ఉచితం.
  • అమెరికా, జపాన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో విద్యార్థులకు
Google AI Pro: ఫ్రీ.. ఫ్రీ.. విద్యార్థులకు శుభవార్త.. ఏడాదిపాటు గూగుల్ AI ప్రో ప్లాన్ ఉచితం.. కాకపోతే!

Google AI Pro: గూగుల్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. అమెరికా, జపాన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఉన్న యూనివర్శిటీ విద్యార్థులకు కంపెనీ AI ప్రో ప్లాన్ ను ఉచితంగా అందించనుంది. ఈ ఆఫర్ ద్వారా విద్యార్థులు గూగుల్ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు, టూల్స్‌ను ఏడాది పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. నిజానికి ఈ గూగుల్ AI ప్రో ప్లాన్ ధర అమెరికాలో నెలకు 19.99 డాలర్స్ (దాదాపు రూ.1,750). అలాగే వార్షిక ప్లాన్ 199.99 డాలర్స్ (దాదాపు రూ.17,500)గా ఉంది. అంటే వార్షిక ప్లాన్ తీసుకుంటే 39.89 డాలర్స్ (దాదాపు 3,500) వరకు ఆదా చేయవచ్చు.

అయితే, అర్హత ఉన్న విద్యార్థులకు ఈ ప్లాన్ ఏడాది పాటు ఉచితంగా లభిస్తుంది. ఈ ఆఫర్‌ను అక్టోబర్ 6వ తేదీ వరకు సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెరికా, జపాన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, బ్రెజిల్ దేశాల్లో ఇది అందుబాటులో ఉంది. త్వరలో మరిన్ని దేశాలకు విస్తరించనున్నారు. ఇప్పటికే ఈ ఆఫర్‌ను భారతీయ విద్యార్థులకు గూగుల్ గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Shashi Tharoor: భారత్ కూడా ప్రతీకారం తీర్చుకోవాలి.. ట్రంప్‌ టారిఫ్‌పై శశిథరూర్ సూచన

గూగుల్ AI ప్రో ప్లాన్ ద్వారా విద్యార్థులు ఏయే ఫీచర్లు పొందగలరంటే..

* Gemini 2.5 Pro, డీప్ రీసెర్చ్ మోడల్స్ యాక్సెస్.

* Veo 3 ద్వారా వీడియో జనరేషన్, Veo 2 ద్వారా ఇమేజ్ నుండి వీడియోలో మార్పు.

* Vertex AI లో Veo 3 Fast కు పరిమిత యాక్సెస్.

* ప్రతి నెలా 1,000 AI క్రెడిట్స్, వీటితో టెక్స్ట్, ఇమేజ్, వీడియో జనరేషన్ చేయొచ్చు.

* NotebookLM లో నోట్‌బుక్‌లు, ఆడియో ఓవర్ వ్యూలు మొదలైన వాటి కోసం 5 రెట్లు ఎక్కువ లిమిట్లు.

* Docs, Sheets, Slides లాంటి గూగుల్ యాప్స్ లో Gemini AI యాక్సెస్.

Spider Bite: షాకింగ్.. సాలీడు కాటు.. ఏడేళ్ల బాలిక మృతి!

ఈ ఉచిత ప్లాన్ ద్వారా విద్యార్థులు గూగుల్ అప్డేటెడ్ AI టూల్స్‌ను వారి విద్యలో ఉపయోగించుకొని, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపర్చుకునే అవకాశం పొందుతున్నారు. ఈ ఆఫర్ టెక్నాలజీ రంగంలో విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్ని కలిగించనుంది.