- ట్రంప్ 50 శాతం టారిఫ్
- ఐఫోన్‌లు మరింత కాస్ల్టీగా మారుతాయా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన 25% సుంకాన్ని 50% కి పెంచిన విషయం తెలిసిందే. 21 రోజుల తర్వాత దీనిని అమలు చేయవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో భారత్ లో తయారయ్యే ఐఫోన్‌ల ధరపై ఈ నిర్ణయాల ప్రభావం ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది? అమెరికాలో విక్రయించే ఐఫోన్‌లలో ఎక్కువ భాగం భారతదేశంలోనే తయారవుతాయని టిమ్ కుక్ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో 50% సుంకంతో అమెరికాలో ఐఫోన్ చాలా ఖరీదైనదిగా మారుతుందా అనే ప్రశ్న తలెత్తవచ్చు?. భారత్ లో ఐఫోన్ ధరపై ఏదైనా ప్రభావం ఉంటుందా? అని చర్చ మొదలైంది.
అమెరికా భారతదేశంపై 50% సుంకం విధించబోతున్నప్పటికీ, అమెరికాలో ఐఫోన్ ధర పెరగదని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి, ఆపిల్ ఇప్పటికే దీనికి ఏర్పాట్లు చేసింది. నివేదికల ప్రకారం, ఆపిల్ మెయిన్ ప్రొడక్ట్స్ ఐఫోన్, ఐప్యాడ్, మాక్‌బుక్‌లను సుంకం నుంచి మినహాయించారు. భారతదేశంపై సుంకం వార్తలు వస్తున్నప్పుడు, టిమ్ కుక్ వైట్ హౌస్‌లో కనిపించారని. ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసి అమెరికాలో ఆపిల్ తయారీ పెట్టుబడిని 100 బిలియన్ డాలర్లకు పెంచుతామని ప్రకటించారు. ఇది ఇప్పటికే 500 బిలియన్ డాలర్లకు పైగా ఉంది.
నివేదికల నుండి వస్తున్న సమాచారం ప్రకారం, ఆపిల్ ఉత్పత్తులకు ప్రత్యేక సుంకం ప్రకటించవచ్చు. దీని అర్థం ఆపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్‌లు లేదా మాక్ బుక్ ప్రస్తుతం ట్రంప్ ప్రకటించిన సుంకం పరిధిలోకి రావు. చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తత మధ్య, ఆపిల్ భారతదేశంలో తన ఐఫోన్‌ల తయారీని పెంచుతున్న విషయం తెలిసిందే. అమెరికాలో విక్రయించే ఐఫోన్‌లలో ఎక్కువ భాగం భారతదేశంలోనే తయారవుతాయని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇప్పటికే ప్రకటించారు.
ట్రంప్ భారతదేశంపై విధించిన సుంకం భారతదేశంలో ఐఫోన్‌లను ఖరీదైనవిగా చేయదు. అమెరికా భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఈ సుంకం విధిస్తారు. కానీ, ఇప్పుడు భారతదేశంలో ఐఫోన్‌లు తయారవుతున్నాయి. దానిపై విధించిన సుంకం ఎటువంటి ప్రభావాన్ని చూపదు కాబట్టి, భారతదేశంలో ఐఫోన్ ధర అలాగే ఉంటుంది.