- బ్లేజ్ సిరీస్‌లో లావా బ్లేజ్ AMOLED 2 5G స్మార్ట్‌ఫోన్ విడుదల
- 5000mAh బ్యాటరీతో పాటు 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
- IP64 రేటింగ్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్
- 6.67 అంగుళాల FHD+ AMOLED స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్.
- 6GB + 128GB మోడల్ ధర రూ.13,499.

Lava Blaze AMOLED 2: భారతదేశీయ మొబైల్ బ్రాండ్ లావా.. తన బ్లేజ్ సిరీస్‌లో లావా బ్లేజ్ AMOLED 2 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ఇదివరకు చెప్పిన విధంగానే నేడు ఫోన్ విడుదల చేయగా.. ఈ ఫోన్‌ను ఆగస్టు 16 నుండి అమ్మకానికి తీసుకరానుంది కంపెనీ. బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చిన ఈ మొబైల్ అనేక ప్రత్యేక ఫీచర్లతో ఆకట్టుకోనుంది. మరి ఫీచర్ల వివరాలేంటో ఒకసారి చూసేద్దామా..
బ్యాటరీ, ఇతర ఫీచర్లు:
ఈ కొత్త లావా బ్లేజ్ AMOLED 2 5G స్మార్ట్‌ఫోన్ లో 5000mAh బ్యాటరీతో పాటు 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభించనుంది. దీనితోపాటు ఈ మొబైల్ లో IP64 రేటింగ్ కలిగి ఉండటం వల్ల ధూళి, నీటి బిందుల నుంచి రక్షణ లభించనుంది. అలాగే ఈ మొబైల్ లో 5G SA/NSA, 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.3, GPS + GLONASS, USB టైపు-C వంటి కనెక్టివిటీ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ISRO Satellite Images: ఈ ఒక్క ఫోటో చాలు.. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి!
కెమెరా సెటప్:
ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే ఇందులో వెనుక భాగన 50MP సోనీ IMX752 సెన్సార్ కెమెరా LED ఫ్లాష్‌తో ఉంది. అలాగే ముందుభాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. ఇక మొబైల్ ముఖ్యంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ సదుపాయం కూడా అందించారు.
పర్ఫార్మెన్స్, స్టోరేజ్:
లావా బ్లేజ్ AMOLED 2 మొబైల్ లో కొత్త MediaTek Dimensity 7060 6nm ప్రాసెసర్‌ను పొందుపరిచారు. అలాగే ఇందులో 6GB LPDDR5 ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజ్ కలిగి ఉంది. స్టోరేజ్‌ను మైక్రో SD ద్వారా 1TB వరకు విస్తరించుకునే సదుపాయం కల్పించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 తో నడుస్తుంది. అదికూడా ఎటువంటి బ్లోట్వేర్ లేకుండా క్లీన్ యూజర్ ఎక్స్‌పీరియెన్స్ ను అందిస్తుంది. ఇక సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ చూస్తే ఇందులో.. లావా ఒక ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్, 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని హామీ ఇచ్చింది.
డిజైన్ అండ్ డిస్ప్లే:
ఈ మొబైల్లో 6.67 అంగుళాల FHD+ AMOLED స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. అయితే లావా తెలిపిన వివరాల ప్రకారం ఈ డిస్ప్లే తన సెగ్మెంట్‌లో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా (7.55mm) నిలుస్తుందని పేర్కొంది. వెనుక ప్యానెల్‌లో లీనేనా డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా అదిరిపోయే ప్యాటర్న్, టెక్స్చర్లు కలిపి ప్రీమియం లుక్‌ను అందించారు.
ధరలు:
లావా బ్లేజ్ AMOLED 2 మిడ్‌నైట్ బ్లాక్, వైట్ ఫెదర్ కలర్లలో కస్టమర్స్ కు లభిస్తుంది. ఇక ధర పరంగా చూస్తే 6GB + 128GB మోడల్ ను రూ.13,499గా నిర్ణయించారు. ఈ కొత్త మొబైల్ అమెజాన్, లావా రిటైల్ అవుట్‌లెట్ లలో 16 ఆగస్టు నుండి విక్రయించబడుతుంది.