- 6.77 అంగుళాల 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్.
- 50MP ప్రధాన కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, అలాగే 50MP ఫ్రంట్ కెమెరా
- 6500mAh బ్యాటరీ, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
- 8GB + 128GB మోడల్ ధర రూ.36,999
- టాప్-ఎండ్ 16GB + 512GB వెర్షన్ రూ.45,999కి లభ్యం.

VIVO V60: భారతదేశంలో నేడు (ఆగష్టు 12) వివో తన కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Vivo V60 ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 6500mAh బ్యాటరీ, 50MP ప్రధాన కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, అలాగే 50MP ఫ్రంట్ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా మొబైల్ కు ఎంతో అవసరమైన IP68, IP69 రేటింగ్ లను కలిగి ఉండడంతో నీరు, దుమ్ము నిరోధకత కలిగి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన Vivo V50కు ఇది అప్డేటెడ్ మోడల్.
ఈ ఫోన్ ఆస్పిషస్ గోల్డ్, మిస్ట్ గ్రే, మూన్లిట్ బ్లూ రంగుల్లో లభ్యం కానుంది. ఏ రోజు లాంచ్ అయినా ఆగస్టు 19 నుంచి వివో ఇండియా e-స్టోర్, ఈ-కామర్స్ సైట్లు, అలాగే ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకాలు మొదలుకానున్నాయి. ఇక ఈ కొత్త మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో వస్తుంది. ఈ ఫోన్‌కు 4 సంవత్సరాల మెజర్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి. వీటితో పాటు AI ఇమేజ్ ఎక్సపాండర్, AI స్మార్ట్ కాల్ అసిస్టెంట్, AI క్యాప్షన్స్, AI ఆధారిత బ్లాక్ స్పాం కాల్ వంటి అద్భుత AI ఫీచర్లు ఉన్నాయి.
Amaravati: రేపే అమరావతిలో బసవతారకం హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన.. పూర్తి వివరాలు ఇవే..
Vivo V60లో 6.77 అంగుళాల 1.5K (1080×2392 పిక్సెల్స్) క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్ లో 4nm స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో, 16GB LPDDR4x ర్యామ్, 512GB UFS 2.2 స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఇక కెమెరా విభాగంలో చూస్తే.. ZEISS భాగస్వామ్యంతో రూపొందించిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 50MP Sony IMX766 ప్రధాన సెన్సార్, 50MP Sony IMX882 టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. అలాగే ఫ్రంట్ సైడ్ లో 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ముందు, వెనుక ఉన్న రెండు కెమెరాలు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి.
ఇక ఈ మొబైల్ లో చెప్పుకోతగ్గ మరో ఫీచర్ 6500mAh బ్యాటరీ. దీనికి 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. అలాగే ఇందులో కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, NFC, USB టైపు-C పోర్ట్ ఉన్నాయి. అలాగే IP68 + IP69 రేటింగ్ వల్ల ఇది నీరు, దుమ్ము నిరోధకత కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
Cyberabad Traffic Police: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. అతి త్వరగా ఇళ్లకు చేరుకోండి!
Vivo V60 మూడు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మిస్ట్ గ్రే వెర్షన్ డైమెన్షన్స్ 163.53×76.96×7.53మి.మీ. ఉండగా, బరువు 192 గ్రాములు ఉంది. అలాగే ఆస్పిషస్ గోల్డ్ వెర్షన్ 7.65మి.మీ. మందంతో, 200 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఇంకా మూన్లిట్ బ్లూ వెర్షన్ 7.75మి.మీ. మందంతో 201 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.
ఇక Vivo V60 ధరల విషయానికి వస్తే.. 8GB + 128GB మోడల్ ధర రూ.36,999 కాగా, 8GB + 256GB మోడల్ రూ.38,999, 12GB + 256GB వెర్షన్ రూ.40,999, అలాగే టాప్-ఎండ్ 16GB + 512GB వెర్షన్ రూ.45,999కి లభ్యం కానుంది. ఈ ఫోన్ ఆగస్టు 19 నుంచి విక్రయానికి వస్తుంది.