Leading News Portal in Telugu

Airplane Mode in Smartphones.. Purpose, Benefits, and Drawbacks Explained


Airplane Mode: మొబైల్‌లో ‘ఎయిర్‌ప్లేన్ మోడ్’ ఆన్ చేస్తే ఏమవుతుందో తెలుసా.?

Airplane Mode: ప్రస్తుతం మనలో దాదాపు స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తునే ఉన్నాము. అయినా కానీ చాలా మందికి మొబైల్ లో అందించే చాలా ఫీచర్లను ఎందుకు వినియోగించుకోవాలన్న విషయాలు తెలియదు. ముఖ్యంగా ఎయిర్‌ప్లేన్ మోడ్, లింక్ టు విండోస్, బ్యాటరీ సేవర్, స్ప్లిట్ స్క్రీన్, స్మార్ట్ మిర్రరింగ్, స్క్రీన్ క్యాస్ట్ ఇలా ఎన్నో ఫీచర్లను ఉన్న వినియోగించలేకపోతున్నాము. ఇకపోతే స్మార్ట్‌ఫోన్లలో ఉండే ఎయిర్‌ప్లేన్ మోడ్ (Airplane Mode) ఎందుకు వినియోగిస్తారు? అసలు దీన్ని యాక్టివేట్ చేసినప్పుడు ఏమి జరుగుతోందో వివరంగా చూద్దాం..

ఎయిర్‌ప్లేన్ మోడ్ ఉద్దేశ్యం:
ఎయిర్‌ప్లేన్ మోడ్ (Airplane Mode) అనేది ఒక ప్రత్యేక ఫీచర్. దీనిని ఆన్ చేస్తే.. ఫోన్‌లోని అన్ని వైర్‌లెస్ కమ్యూనికేషన్ ఫీచర్లు అంటే సెల్యులార్ నెట్‌వర్క్, Wi-Fi, బ్లూటూత్, GPS సిగ్నల్స్ వంటివి తాత్కాలికంగా నిలిచిపోతాయి. ఇది ప్రధానంగా విమాన ప్రయాణ సమయంలో, విమాన నావిగేషన్ వ్యవస్థలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు వాడుతారు. విమాన ప్రయాణంలో ఫోన్ సిగ్నల్స్ వల్ల విమాన నావిగేషన్ లేదా కమ్యూనికేషన్ సిస్టమ్‌కి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా నిరోధించడం ఎయిర్‌ప్లేన్ మోడ్ ముఖ్య ఉద్దేశ్యం. దీని వాడడం ద్వారా అన్ని వైర్‌లెస్ సిగ్నల్స్‌ను ఒకేసారి ఆఫ్ చేసి, మొబైల్ ను “ఆఫ్‌లైన్” మోడ్‌లోకి మార్చడం. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో బ్యాటరీని ఆదా చేయడం, లేదా సిగ్నల్స్ అవసరం లేని పరిస్థితుల్లో ఉపయోగించడం కోసం దీనిని వాడుతారు.

Supreme Court: “ఒక్కటి కూడా ఉండొద్దు”.. వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..

Image (4)

ప్రయోజనాలు:
ఈ ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేయడం ద్వారా.. సిగ్నల్ సెర్చ్ ఆపివేయడం వల్ల మొబైల్ లోని బ్యాటరీ ఎక్కువ సేపు వినియోగంలో ఉంటుంది. అలాగే కాల్స్, మెసేజ్‌లు, నోటిఫికేషన్‌లు రాకుండా ప్రశాంతంగా పనిచేయడంలో ఫోకస్ పెరుగుతుంది. ఇంకో విషయమేమిటంటే ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో చార్జ్ చేయడం ద్వారా మొబైల్ మాములు కంటే కొంచెం వేగంగా ఛార్జ్ అవుతుంది. మొబైల్ సిగ్నల్స్ ఆఫ్ కావడం వల్ల తాత్కాలికంగా మన చుట్టూ రేడియేషన్ స్థాయి తగ్గుతుంది కూడా. అలాగే ఇదివరకు చెప్పినట్లుగా విమాన ప్రయాణంలో ఎటువంటి సాంకేతిక అంతరాయం లేకుండా సురక్షిత ప్రయాణం చేయవచ్చు.

ప్రతికూలతలు:
ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేయడం వల్ల ప్రయోజనాలే కాదు.. ప్రతికూలతలు కూడా ఉన్నాయండోయ్.. ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేయడం ద్వారా మనం కాల్స్, SMSలు, మొబైల్ డేటా ఉపయోగించలేరు. అంతేకాకుండా నెట్వర్క్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల అత్యవసర సమయంలో వెంటనే ఇతరులతో సంప్రదించలేరు. ప్రతిరోజు అలవాటు పడ్డ వాట్సాప్, ఇమెయిల్, సోషల్ మీడియా నోటిఫికేషన్లు ఆగిపోతాయి. అలాగే కొన్ని యాప్స్‌లో లైవ్ లొకేషన్ సరిగ్గా పని చేయకపోవచ్చు.

Image (6)

VIVO V60: వచ్చిందమ్మ వయ్యారి.. 6500mAh బ్యాటరీ, IP69 రేటింగ్, ZEISS కెమెరాలతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్!

మొత్తం మీద, ఎయిర్‌ప్లేన్ మోడ్ అనేది అవసరమైనప్పుడు ఉపయోగపడే ఫీచర్. విమాన ప్రయాణం, బ్యాటరీ సేవింగ్, లేదా నిర్దిష్ట సమయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలనుకుంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ యాక్టివేట్ చేసినప్పుడు నెట్‌వర్క్ ఆధారిత సేవలు నిలిచిపోతాయని గుర్తుంచుకోవాలి.