Leading News Portal in Telugu

Vu Launches Glo QLED TV 2025 (Dolby Edition) Series in India with Dolby Vision, Atmos, and Gaming Features


  • సౌండ్, పిక్చర్, స్మార్ట్ ఫీచర్స్ అన్నీ మాక్స్ లెవెల్‌
  • డాల్బీ విజన్, HDR10, HLG సపోర్ట్ ద్వారా HDR కంటెంట్‌ను మరింత నాణ్యంగా
  • 24W డాల్బీ ఆట్మోస్ సౌండ్ సిస్టమ్స్
  • 1.5GHz VuOn AI ప్రాసెసర్, 2GB ర్యామ్, 16GB స్టోరేజ్‌
  • 43″, 50″, 55″, 65″, 75″ స్క్రీన్ సైజుల్లో టీవీలు అందుబాటులో.
Vu Glo QLED TV: థియేటర్ ఫీలింగ్ గ్యారంటీ! సౌండ్, పిక్చర్, స్మార్ట్ ఫీచర్స్ అన్నీ మాక్స్ లెవెల్‌లో ఉండే కొత్త స్మార్ట్ టీవీలు..

Vu Glo QLED TV: గత కొద్దికాలంగా వీడియో టెక్నాలజీలో బాగా ప్రసిద్ధి చెందిన ‘Vu’ సంస్థ తాజాగా భారత్‌లో Glo QLED TV 2025 (Dolby Edition) సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీలు 43 ఇంచుల నుంచి 75 ఇంచుల వరకు వివిధ స్క్రీన్ సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి A+ గ్రేడ్ Glo ప్యానెల్, 400 నిట్స్ బ్రైట్‌నెస్, QLED టెక్నాలజీతో 92% NTSC కలర్ రేంజ్ ద్వారా మరింత సహజమైన రంగులు, స్పష్టమైన కాంట్రాస్ట్ అందించనున్నాయి. మరి ఇన్ని ప్రత్యేకతలున్న కొత్త స్మార్ట్ టీవీల పూర్తి ఫైచాలను చూసేద్దామా..

ఈ కొత్త Vu Glo QLED స్మార్ట్ టీవీలు ప్రత్యేక ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో డాల్బీ విజన్, HDR10, HLG సపోర్ట్ ద్వారా HDR కంటెంట్‌ను మరింత నాణ్యంగా చూపుతాయి. అలాగే ఆడియో కోసం 24W డాల్బీ ఆట్మోస్ సౌండ్ సిస్టమ్స్ లో రెండు మాస్టర్ బాక్స్ స్పీకర్లు, ఆటో వాల్యూమ్ కంట్రోల్, ఆడియో ఓన్లీ మోడ్, ఈక్వలైజర్, డైలాగ్ క్లారిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ద్వారా మనం దాదాపు సినిమా థియేటర్స్ లో వచ్చే సౌండ్ ఎక్స్పీరియన్స్ ను అందుకోవచ్చు.

Airplane Mode: మొబైల్‌లో ‘ఎయిర్‌ప్లేన్ మోడ్’ ఆన్ చేస్తే ఏమవుతుందో తెలుసా.?

Image (10)

ఈ స్మార్ట్ టీవీలలో 1.5GHz VuOn AI ప్రాసెసర్, 2GB ర్యామ్, 16GB స్టోరేజ్‌తో ల్యాగింగ్ లేకుండా పనితీరును అందిస్తాయి. AI ఆధారిత అప్‌స్కేలింగ్ కూడా వీటిలో ఉంది. అంతేకూండా వీటి రిమోట్‌లో Wi-Fi హాట్‌కీ, క్రికెట్, సినిమా మోడ్‌లు, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఇక గేమింగ్ ఫీచర్ల విషయానికి వస్తే.. గేమింగ్ కోసం VRR, ALLM, HDR, క్రాస్‌హెయిర్ మోడ్ కలిగిన గేమ్ బార్ అందుబాటులో ఉంది. వీటివల్ల తక్కువ ల్యాగ్‌తో స్మూత్ గేమ్‌ప్లే సాధ్యమవుతుంది.

ఈ టీవీలు Google TV OS మీద నడుస్తాయి. 4K స్ట్రీమింగ్ సపోర్ట్‌తో పాటు Apple AirPlay, HomeKit, Chromecast, Bluetooth 5.3, డ్యుయల్ బ్యాండ్ Wi-Fi, కెమెరా సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. Vu కంపెనీ తన Glo QLED TV 2025 (Dolby Edition) ను భారత మార్కెట్లో గ్రే కలర్‌లో మూడు వైపులా బెజెల్‌లెస్ ఫ్లోటింగ్ గ్లాస్ డిజైన్‌తో విడుదల చేసింది. ఈ సిరీస్ లో భాగంగా 43″, 50″, 55″, 65″, 75″ స్క్రీన్ సైజుల్లో టీవీలు అందుబాటులో ఉన్నాయి.

Image (9)

OnePlus-Bhagwati: భారత్‌లోనే ప్రీమియమ్ ట్యాబ్లెట్ల తయారీ.. భగవతి ప్రొడక్ట్స్‌తో చేతులు కలిపిన వన్‌ప్లస్!

ఇవి 4K QLED డిస్ప్లేతో పాటు 400 నిట్స్ బ్రైట్‌నెస్, 92% NTSC కలర్ గామట్, MEMC టెక్నాలజీ, AI అప్‌స్కేలింగ్ వంటి ఫీచర్లు అందించబడుతున్నాయి. ఆడియో కోసం 24W డాల్బీ ఆట్మోస్ సిస్టమ్‌తో రెండు స్పీకర్లు ఉన్నాయి. గేమింగ్ యూజర్ల కోసం VRR, ALLM, గేమ్ డ్యాష్‌బోర్డ్ వంటి ప్రత్యేక ఆప్షన్లు తీసుకవచ్చారు. అలాగే కనెక్టివిటీ పరంగా 2 USB పోర్టులు, 3 HDMI (ARC/eARC/CEC), హెడ్‌ఫోన్ జాక్, ఆప్టికల్ అవుట్, AV ఇన్, లాన్ పోర్ట్ లభ్యమవుతాయి.

Image (8)

ఇక ఈ టీవీల ధరల విషయానికి వస్తే, 43 అంగుళాల మోడల్ రూ.24,990, 50 అంగుళాల రూ.30,990, 55 అంగుళాల రూ.35,990, 65 అంగుళాల రూ.50,990, 75 అంగుళాల రూ.64,990గా నిర్ణయించారు. ఈ టీవీలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో అభ్యం కానున్నాయి.