- ప్రపంచంలోనే మొదటి తొలి 115 అంగుళాల మైక్రో RGB టీవీ లాంచ్
- తొలి మైక్రో RGB డిస్ప్లే టీవీని ఆవిష్కరించిన శాంసంగ్.
- టీవీ ధర 44.9 మిలియన్ వోన్స్.

Samsung Micro RGB TV: ప్రపంచ ప్రీమియమ్ టీవీ మార్కెట్లో మరోసారి తన సాంకేతిక ఆధిపత్యాన్ని శాంసంగ్ కొనసాగిస్తోంది. 115 ఇంచుల స్క్రీన్ సైజ్‌తో ప్రపంచంలోనే తొలి మైక్రో RGB డిస్ప్లే టీవీని ఆవిష్కరించింది. ఈ కొత్త టీవీ మైక్రో స్థాయి RGB LED బ్యాక్‌లైట్ సాంకేతికతను ఉపయోగించి రంగుల ఖచ్చితత్వం, కాంట్రాస్ట్‌ను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా రూపొందించబడింది.
శాంసంగ్ కంపెనీ తన సొంత మైక్రో RGB టెక్నాలజీ ఈ టీవీకి మెయిన్ అట్ట్రాక్షన్. ఇందులో 100μm కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల మైక్రో LEDలు స్క్రీన్ ప్యానల్ వెనుక అమర్చబడి ఉన్నాయి. ఇవి ప్రతి LEDను వ్యక్తిగతంగా నియంత్రించే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని వల్ల స్క్రీన్ మొత్తం మీద బ్రైట్నెస్, రంగుల అవుట్‌పుట్‌పై మైక్రో నియంత్రణ సాధ్యం అవుతుంది.
TTD: తిరుమలకు వెళ్లే వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై అది లేకుంటే నో ఎంట్రీ..!
ఇందులోని మైక్రో RGB AI ఇంజిన్ టీవీ కంటెంట్‌ను ఫ్రేమ్-బై-ఫ్రేమ్‌గా విశ్లేషించి పిక్చర్, సౌండ్ రెండింటినీ ఆప్టిమైజ్ చేస్తుంది. ఇందులోని మైక్రో RGB కలర్ బూస్టర్ ప్రో ఫీచర్ ద్వారా మసక రంగులతో ఉన్న సీన్స్‌ను మరింత బ్రైట్నెస్ గా మారుస్తుంది. ఈ మైక్రో RGB ప్రిసిషన్ కలర్ ఫీచర్ ద్వారా ఈ టీవీ BT.2020 కలర్ స్పేస్‌ను 100% కవర్ చేస్తుందని శాంసంగ్ తెలిపింది. జర్మనీకి చెందిన VDE (Verband der Elektrotechnik) నుంచి మైక్రో RGB ప్రిసిషన్ కలర్ సర్టిఫికేషన్ కూడా పొందింది.
ఇందులోని గ్లేర్ ఫ్రీ టెక్నాలజీ ద్వారా ప్రకాశవంతమైన వాతావరణంలో కూడా స్క్రీన్ రిఫ్లెక్షన్స్ తగ్గుతాయి. స్లిమ్ మెటల్ బాడీతో మినిమలిస్టిక్ డిజైన్‌లో ఈ టీవీ రూపొందించబడింది. ఈ టీవీలో Samsung Vision AI, అప్డేట్ అయిన జనరేటివ్ AI ఆధారిత బిక్స్బీ వాయిస్ అసిస్టెంట్ అందుబాటులో ఉంది. అలాగే ఇందులో భద్రత కోసం Samsung Knox ప్లాట్‌ఫామ్, అలాగే 7 ఏళ్లపాటు ఉచిత Tizen OS అప్‌గ్రేడ్ సదుపాయం లభిస్తుంది.
Broccoli: బ్రోకలి శాండ్విచ్ తిని ప్రముఖ మ్యూజీషియన్ మృతి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Samsung Micro RGB TV 2025 స్పెసిఫికేషన్స్:
* 115 అంగుళాల 4K (3840×2160) మైక్రో RGB HDR+ ప్యానెల్, 144Hz రిఫ్రెష్ రేట్, ఫిలింమేకర్ మోడ్
* ALLM, VRR, FreeSync Premium Pro సపోర్ట్
* 4K AI Upscaling Pro – 128 AI న్యూరల్ నెట్వర్క్స్తో కంటెంట్ అప్‌స్కేలింగ్
* Auto HDR Remastering Pro, HDR క్వాలిటీ మెరుగుదల
* Tizen OS, Samsung Knox Security
* సోలార్ సెల్ రిమోట్ కంట్రోల్, SmartThings కనెక్టివిటీ
* Wi-Fi 5, Bluetooth 5.3, 4x HDMI eARC, ఇథర్నెట్
* 70W (4.2.2CH) స్పీకర్లు, Dolby Atmos, Q-Symphony
ధర:
శాంసంగ్ మైక్రో RGB 115 అంగుళాల 4K టీవీ ధర 44.9 మిలియన్ వోన్స్ అంటే సుమారు రూ.28,33,690గా నిర్ణయించబడింది. ఇది ప్రస్తుతం కొరియాలో అమ్మకాలకు అందుబాటులో ఉంది. త్వరలో అమెరికాలో కూడా లాంచ్ కానుంది. ఆ తర్వాత, గ్లోబల్ మార్కెట్లో ఇతర స్క్రీన్ సైజ్‌లతో కూడిన వెర్షన్లు విడుదల చేయనుంది.