Poco M7 Plus 5G Launched in India With 50mp Camera, 7,000mAh Battery, Snapdragon 6s Gen 3, Starting at 13999
- 6.9 అంగుళాల Full-HD+ స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్
- Snapdragon 6s Gen 3 చిప్‌సెట్.
- 2 సంవత్సరాల మెజర్ OS అప్‌డేట్స్
- 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్.
- IP64 రేటింగ్, 50MP ప్రైమరీ రియర్ కెమెరా
- 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 33W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్.

Poco M7 Plus 5G: పోకో (Poco) సంస్థ బుధవారం భారత మార్కెట్లో Poco M7 Plus 5G ను అధికారికంగా విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh సిలికాన్-కార్బన్ భారీ బ్యాటరీ ఉంది. ఇది 33W ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు ఇతర ఫోన్లు, యాక్సెసరీస్‌లకు రివర్స్ చార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ధరలో ఇప్పటివరకు వచ్చిన ఫోన్లలో ఇదే అతిపెద్ద బ్యాటరీ అని కంపెనీ చెబుతోంది. ఇది Qualcomm Snapdragon 6s Gen 3 చిప్‌సెట్‌తో వస్తోంది. ఇందులో 8GB వరకు RAM ఆప్షన్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ ఇప్పటికే ఉన్న Poco M7 5G, Poco M7 Pro 5G మోడల్స్‌లో కొత్తగా చేరింది.
Poco M7 Plus 5G భారతదేశంలో 6GB + 128GB వేరియంట్ ధర రూ.13,999 నుంచి ప్రారంభమవుతుంది. అదే 8GB + 256GB వేరియంట్ ధర రూ.14,999 గా నిర్ణయించారు. ఇక ఈ మొబైల్ ను ఆగస్టు 19 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇది ఆక్వా బ్లూ, కార్బన్ బ్లాక్, క్రోమ్ సిల్వర్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇక లాంచ్ ఆఫర్లలో భాగంగా.. HDFC, SBI, ICICI బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్, అలాగే పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై అదనంగా మరో 1,000 బోనస్ అందుబాటులో ఉంటుంది.
Hindu Temple Attack: మరో హిందూ ఆలయం ధ్వంసం.. ఏడాదిలో నాలుగో ఘటన!
Poco M7 Plus 5G స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 6.9 అంగుళాల Full-HD+ (1080×2340 పిక్సెల్స్) స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, 288Hz టచ్ సాంప్లింగ్ రేట్, గరిష్టంగా 850 నిట్స్ బ్రైట్‌నెస్.
సర్టిఫికేషన్లు: TÜV Rheinland నుండి Low Blue Light, Flicker-Free, Circadian ప్రమాణాలకు ట్రిపుల్ సర్టిఫికేషన్.
ప్రాసెసర్: Snapdragon 6s Gen 3 చిప్‌సెట్.
ర్యామ్, స్టోరేజ్: 8GB LPDDR4x RAM (వర్చువల్‌గా 16GB వరకు పెంచుకోగలరు), 128GB UFS 2.2 స్టోరేజ్.
సాఫ్ట్‌వేర్: Android 15 ఆధారంగా HyperOS 2.0, 2 సంవత్సరాల మెజర్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్.
కెమెరాలు: 50MP ప్రైమరీ రియర్ కెమెరా + సెకండరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, గరిష్టంగా 1080p/30fps వీడియో రికార్డింగ్.
బ్యాటరీ: 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 33W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 18W రివర్స్ వైర్డ్ చార్జింగ్.
Saleem Pistol arrest: నేపాల్‌లో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్.. ఐఎస్ఐతో కనెక్షన్స్
కనెక్టివిటీ: 5G, 4G, Bluetooth 5.1, Wi-Fi, GPS, USB Type-C పోర్ట్.
సెక్యూరిటీ: సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్.
రేటింగ్: IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్.
సైజు, బరువు: 169.48×80.45×8.40 మిమీ, బరువు 217 గ్రాములు.