Leading News Portal in Telugu

Lenovo Tab Launched in India With Dolby Atmos Audio, Helio G85, and 4 Years of Security Updates


  • ఎంట్రీ-లెవల్ ట్యాబ్లెట్ Lenovo Tab భారతదేశంలో విడుదల
  • 10.1-అంగుళాల Full-HD డిస్‌ప్లే
  • 5,100mAh బ్యాటరీ, 15W చార్జింగ్‌ సపోర్ట్
  • 8MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా.
  • 4GB RAM + 64GB స్టోరేజ్ కలిగిన Wi-Fi వెర్షన్ ధర రూ.10,999.
Lenovo Tab: డాల్బీ ఆటమ్స్ సౌండ్‌, 5,100mAh బ్యాటరీ, 4 సంవత్సరాల సెక్యూరిటీతో కొత్త ట్యాబ్ లాంచ్!

Lenovo Tab: లెనోవో తన తాజా ఎంట్రీ-లెవల్ ట్యాబ్లెట్ Lenovo Tabను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ట్యాబ్‌లో MediaTek Helio G85 ప్రాసెసర్, 4GB RAM తో పాటు 10.1-అంగుళాల Full-HD డిస్‌ప్లే (60Hz రిఫ్రెష్ రేట్) ఉంది. 5,100mAh బ్యాటరీతో వచ్చిన ఈ డివైస్ 15W చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. వినియోగదారులు Wi-Fi మాత్రమే లేదా Wi-Fi + LTE వెర్షన్‌లలో దీనిని ఎంచుకోవచ్చు. ఫోటోలు, వీడియో కాల్స్ కోసం 8MP రియర్ కెమెరా, డ్యూయల్ స్పీకర్లు (Dolby Atmos) ఉన్నాయి.

ఈ కొత్త లెనోవో ట్యాబ్ ధర భారతదేశంలో 4GB RAM + 64GB స్టోరేజ్ కలిగిన Wi-Fi వెర్షన్ ధర రూ.10,999గా నిర్ణయించబడింది. అదే కాన్ఫిగరేషన్‌కి Wi-Fi + LTE కనెక్టివిటీతో కూడిన వెర్షన్ ధర రూ. 12,999గా ఉంది. ఇక 4GB RAM + 128GB స్టోరేజ్ కలిగిన Wi-Fi మోడల్‌ ధర రూ. 11,998గా ఉంది. ఈ ట్యాబ్స్ పోలార్ బ్లూ (Polar Blue) కలర్‌లో అందుబాటులో ఉంటుంది. లెనోవో వెబ్ సైట్, లెనోవో ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, ఈ-కామర్స్ వెబ్‌సైట్లు ఇంకా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో దీనిని కొనుగోలు చేయవచ్చు. ఇదే ఈవెంట్‌లో లెనోవో ఐడియా ట్యాబ్ (Idea Tab) కూడా ప్రకటించింది. దీని ప్రారంభ ధర రూ.16,999.

Engagement With AI Chatbot: సంచలనం.. AIతో ప్రేమ, ఐదు నెలల్లో నిశ్చితార్థం! మహిళ పోస్ట్ వైరల్..

Image (7)

లెనోవో ట్యాబ్ స్పెసిఫికేషన్లు:
సాఫ్ట్వేర్: Android 14 ఆధారంగా Lenovo ZUI 16.

అప్‌డేట్స్: 2 సంవత్సరాల Android OS అప్‌గ్రేడ్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచులు.

డిస్ప్లే: 10.1 అంగుళాల Full-HD (1,200×1,920) పిక్సెల్స్, 60Hz రిఫ్రెష్ రేట్, 400 nits బ్రైట్‌నెస్, TÜV Low Blue Light సర్టిఫికేషన్.

ప్రాసెసర్: MediaTek Helio G85 ఆక్టా-కోర్.

ర్యామ్, స్టోరేజ్: 4GB LPDDR4X RAM, గరిష్టంగా 128GB eMMC స్టోరేజ్.

Poco M7 Plus 5G: 7,000mAh బ్యాటరీ, 50MP రియర్ కెమెరా.. మిడ్ రేంజ్ ఫోన్స్ బాప్ ఆగయా!

Image (6)

కెమెరాలు: 8MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా.

ఆడియో: డ్యూయల్ స్పీకర్లు డాల్బీ ఆటమ్స్ ట్యూనింగ్‌తో.

బాడీ: మెటల్ బాడీ డిజైన్.

కనెక్టివిటీ: బ్లూటూత్ 5.3, Wi-Fi 5, పేస్ అన్ లాక్ సపోర్ట్.

యాక్సెసరీస్: ఇన్‌బిల్ట్ కిక్‌స్టాండ్ ఉన్న క్లియర్ కేస్, స్టాండ్ బై మోడ్ (ఫోటో ఫ్రేమ్ లేదా క్లాక్‌గా ఉపయోగించుకోవచ్చు).

బ్యాటరీ: 5,100mAh, 15W ఫాస్ట్ చార్జింగ్.

సైజు: 9.5 × 235.7 × 154.5 మిమీ.

Image (5)