Leading News Portal in Telugu

Honor X7c 5G With SGS 5-Star Drop Resistance, Snapdragon 4 Gen 2, and 300% High-Volume Mode to Launch in India Soon


  • SGS 5-స్టార్ డ్రాప్ రిజిస్టెన్స్, IP64 రేటింగ్
  • 50MP AI మోషన్ సెన్సింగ్ కెమెరా
  • Snapdragon 4 Gen 2 (4nm) చిప్‌సెట్, MagicOS 8.0తో Magic Capsule
  • ఎలిగెంట్ ఫారెస్ట్ గ్రీన్, మూన్ లైట్ వైట్ రంగుల్లో
  • డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 300% హై వాల్యూమ్ మోడ్‌.
Honor X7c 5G: SGS 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 300% హై వాల్యూమ్ మోడ్‌‌తో విడుదలకు సిద్దమైన కొత్త స్మార్ట్‌ఫోన్!

Honor X7c 5G: హానర్ (Honor) తన కొత్త మిడ్ రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ Honor X7c 5G ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. బలమైన నిర్మాణం, అధునాతన ఫీచర్లు, ఇంకా దీర్ఘకాలిక బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ వినియోగదారులకు మన్నికైన అనుభవాన్ని అందించబోతోంది. ఈ మొబైల్ లో ప్రత్యేకంగా SGS 5-స్టార్ డ్రాప్ రిజిస్టెన్స్, IP64 రేటింగ్ కలిగి ఉండడంతో.. మొబైల్ చేతిలో నుండి పడిపోవడం, నీటి చుక్కలు, దుమ్ము వంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా రూపొందించబడింది.

Image (16)

హానర్ X7c 5G బలమైన బాడీ, అధునాతన రక్షణతో వస్తోంది. ఇది SGS సర్టిఫికేట్ పొందిన 5-స్టార్ డ్రాప్ రిజిస్టెన్స్ కలిగి ఉంది. అంతేకాదు ఈ మొబైల్ ఏకంగా 3 నిమిషాల ‘వాషింగ్ టెస్ట్’ పాస్ అయింది. దీని వల్ల నీటి చుక్కలు, పొడి మట్టి వంటి వాటి నుంచి ఫోన్ సురక్షితంగా ఉంటుంది. IP64 రేటింగ్ కారణంగా దుమ్ము మరియు నీటి స్ప్లాష్‌లను తట్టుకునే సామర్థ్యం కలిగింది. ఇక బ్యాటరీ విషయంలో 5,200mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీ రానుంది. దీనికి 35W SuperCharge ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇది వేగంగా చార్జ్ అవుతుంది. ఇక హానర్ ల్యాబ్ టెస్టుల ప్రకారం ఈ మొబైల్ 19 గంటల ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్, 55 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ అందించగలదు. అలాగే Ultra Power-Saving Mode ద్వారా కేవలం 2% బ్యాటరీతో 60 నిమిషాల వరకు వాయిస్ కాల్ చేసే అవకాశం ఉంటుంది.

Infinix Hot 60i 5G: మార్కెట్‌ను ఏలడానికి సిద్దమైన ఇన్‌ఫినిక్స్‌.. 6,000mAh బ్యాటరీ, 6.75 అంగుళాల డిస్ప్లేతో రాబోతున్న కొత్త ఫోన్!

Image (15)

ఇక మెమరీ విషయానికి వస్తే.. ఇందులో 8GB RAM ఉండి Honor RAM Turbo సాంకేతికతతో అదనంగా 8GB వర్చువల్ RAM లభిస్తుంది. అంటే మొత్తం 16GB RAM అనుభవం లభిస్తుంది. 256GB UFS 3.1 స్టోరేజ్ సౌకర్యం వల్ల సుమారు 60,000 ఫోటోలు నిల్వ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇక ఆడియో (Sound) అనుభూతి కోసం.. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, Hi-Res ఆడియో సపోర్ట్, 300% హై వాల్యూమ్ మోడ్‌ను అందిస్తుంది.

Image (14)

Honor X7c 5G కెమెరా విభాగంలో 50MP AI మోషన్ సెన్సింగ్ కెమెరా ఉండి, కదలికల సమయంలోనూ స్పష్టమైన ఫోటోలు తీసేలా సాయపడుతుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే.. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్, 850 nits పీక్ బ్రైట్‌నెస్ కలిగిన డిస్ప్లేను అందించనున్నారు. దీనివల్ల చీకటి పరిస్థితుల్లో 2 nits వరకు తక్కువ బ్రైట్‌నెస్‌తో ఐ కేర్ మోడ్ సపోర్ట్ చేస్తుంది. ఇక ప్రాసెసర్ పరంగా Snapdragon 4 Gen 2 (4nm) చిప్‌సెట్, MagicOS 8.0 (Android 14) తో Magic Capsule, Quick Access టూల్స్, Three-finger స్వైప్ షార్ట్‌కట్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Lenovo Tab: డాల్బీ ఆటమ్స్ సౌండ్‌, 5,100mAh బ్యాటరీ, 4 సంవత్సరాల సెక్యూరిటీతో కొత్త ట్యాబ్ లాంచ్!

Image (13)

డిజైన్ పరంగా.. ఇది ఎలిగెంట్ ఫారెస్ట్ గ్రీన్, మూన్ లైట్ వైట్ రంగుల్లో లభిస్తుంది. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా Honor X7c 5G త్వరలో అమెజాన్ ద్వారా లాంచ్ అవనుంది. భారత వెర్షన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, Ultra Power-Saving Mode, 8GB RAM + 8GB వర్చువల్ RAM, రెండు రంగుల ఎంపికలు అందుబాటులో ఉండనున్నాయి.

Image (12)