
OnePlus Nord 5 vs Vivo V60: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మధ్యస్థాయి ప్రీమియం సెగ్మెంట్‌లో పోటీ రోజురోజుకూ మరింత హీటెక్కుతోంది. ఈ పోటీలో తాజాగా రంగప్రవేశం చేశాయి OnePlus Nord 5, Vivo V60 సామ్రాట్ ఫోన్స్. రెండు ఫోన్లు కూడా మంచి డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్లు, పెద్ద బ్యాటరీలు, హై-రిజల్యూషన్ కెమెరాలతో వచ్చాయి. అయితే ఫీచర్లు, పనితీరు, ధర పరంగా చూస్తే ఏది బెటర్? ఎందుకు? ఇప్పుడు ఈ రెండు ఫోన్లను విభాగాల వారీగా పోల్చి చూద్దాం.
డిజైన్, బిల్డ్ క్వాలిటీ:
Vivo V60, OnePlus Nord 5 రెండూ ప్రీమియమ్ లుక్‌తో వచ్చాయి. కానీ, వీటిలో కొన్ని తేడాలు ఉన్నాయి. Vivo V60 కి IP68, IP69 వంటి ప్రీమియం రేటింగ్స్ ఉన్నాయి. ఇవి నీటిలో ముంచినప్పటికీ, అధిక ప్రెజర్ వాటర్ జెట్స్‌కి కూడా రక్షణ ఇస్తాయి. OnePlus Nord 5 లో IP65 రేటింగ్ మాత్రమే ఉంది. ఇది దుమ్ము, చినుకుల నుంచి రక్షిస్తుంది. కానీ, Vivo లాగే హెవీ వాటర్ ప్రొటెక్షన్ ఇవ్వదు. బరువు విషయంలో Vivo V60 తేలికగా ఉంటుంది (192g–201g), అదే Nord 5 కాస్త ఎక్కువ బరువు (211g).
VinFast Minio Green EV: సామాన్యుల ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది..! ఇది నానో కంటే చిన్నది..
డిస్ప్లే:
Vivo V60 లో 6.77-అంగుళాల క్వాడ్ కర్వ్ AMOLED డిస్‌ప్లే, 1.5K రెసల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 nits పీక్ బ్రైట్‌నెస్ ఉంది. OnePlus Nord 5 లో 6.83-అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 1,800 nits బ్రైట్‌నెస్ ఉంది. రిఫ్రెష్ రేట్ విషయంలో Nord 5 మెరుగ్గా ఉండగా, బ్రైట్‌నెస్ మరియు కర్వ్ డిజైన్ విషయంలో Vivo V60 ఆధిక్యం సాధిస్తుంది.
పర్ఫార్మెన్స్:
Vivo V60 లో Snapdragon 7 Gen 4 ప్రాసెసర్, గరిష్టంగా 16GB RAM, 512GB స్టోరేజ్ ఉంటుంది. OnePlus Nord 5 లో Snapdragon 8s Gen 3 ప్రాసెసర్, గరిష్టంగా 12GB RAM, 512GB స్టోరేజ్ ఉంటుంది. ఇది ప్రాసెసింగ్ పవర్‌లో Nord 5 ను ముందుకు నెడుతుంది. రెండూ Android 15 పై రన్ అవుతున్నా, Vivo V60 కి 4 సంవత్సరాల OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ హామీ ఉంది. Nord 5 లో OxygenOS 15, కొత్త AI ఫీచర్లు, Plus Key ఉన్నాయి.
War 2: వార్ 2 సినిమా చూడ్డానికి 10 రీజన్స్!
కెమెరా:
Vivo V60 లో Zeiss సహకారంతో ట్రిపుల్ రియర్ కెమెరా 50MP మెయిన్ (Sony IMX766), 50MP టెలిఫోటో (Sony IMX882), 8MP అల్ట్రావైడ్, అలాగే 50MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. OnePlus Nord 5 లో 50MP మెయిన్ (Sony LYT-700), 8MP అల్ట్రావైడ్, మరియు 50MP ఫ్రంట్ కెమెరా (Samsung ISOCELL JN5) ఉన్నాయి. Vivo V60 లో టెలిఫోటో లెన్స్ ఉండడం వల్ల జూమ్ ఫోటోల్లో స్పష్టత ఎక్కువగా ఉంటుంది.
బ్యాటరీ:
Vivo V60 లో 6,500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. OnePlus Nord 5 లో కాస్త ఎక్కువ 6,800mAh బ్యాటరీ, 80W SuperVOOC ఛార్జింగ్ ఉంటుంది. చార్జింగ్ స్పీడ్‌లో Vivo ముందుంటే, బ్యాటరీ సామర్థ్యంలో Nord 5 కొంచెం ఎక్కువ.
కనెక్టివిటీ, అదనపు ఫీచర్లు:
రెండూ 5G, Wi-Fi, Bluetooth 5.4, NFC, GPS సపోర్ట్ చేస్తాయి, అలాగే ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్, IR బ్లాస్టర్ ఉంటాయి. Vivo V60 లో అదనంగా IP69 ప్రొటెక్షన్, AI ఫీచర్లు ఉంటే.. Nord 5 లో ప్లస్ కీ, 144Hz డిస్‌ప్లే స్మూత్‌నెస్ అదనపు ఆకర్షణ.
ధర:
Vivo V60 ధర 8GB+128GB రూ.36,999 కాగా, 16GB+512GB రూ.45,999 ఉంటుంది. అదే OnePlus Nord 5 ధర 8GB+128GB రూ.31,999, 12GB+512GB 37,999 ఉంటుంది. పనితీరులో Nord 5 తక్కువ ధరలో మెరుగైన ప్రాసెసర్ ఇస్తుంది. కానీ Vivo V60 ఎక్కువ ధరకు బలమైన ప్రొటెక్షన్, బ్రైట్ డిస్‌ప్లే, టెలిఫోటో కెమెరా అందిస్తుంది.
మొత్తంగా.. మీరు దృఢమైన బాడీ, అల్ట్రా బ్రైట్ స్క్రీన్, టెలిఫోటో కెమెరా కోరుకుంటే Vivo V60 మీకు సరైన ఎంపిక. అదే ఫ్లాగ్‌షిప్ లెవెల్ ప్రాసెసింగ్ పవర్, ఎక్కువ రిఫ్రెష్ రేట్, తక్కువ ప్రారంభ ధర కోరుకునే వారికి OnePlus Nord 5 మంచి ఆప్షన్.