- రెడ్మీ 15 5G (Redmi 15) భారత మార్కెట్లో అధికారికంగా విడుదల
- రూ.14,999ల ప్రారంభ ధరతో లాంచ్
- 7000mAh భారీ బ్యాటరీ, 50MP రియర్ కెమెరా
- IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ రేటింగ్, 8MP ఫ్రంట్ కెమెరా
- లాంచ్ ఆఫర్లలో భాగంగా రూ.1000 ఇన్స్టంట్ తగ్గింపు.

REDMI 15 5G: షావోమి సంస్థ తన తాజా నంబర్ సిరీస్ లో భాగంగా రెడ్మీ 15 5G (Redmi 15)ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల FHD+ 144Hz LCD డిస్ప్లే ఉండగా, ఇది సెక్టార్‌లోనే అతిపెద్ద స్క్రీన్‌గా కంపెనీ తోంది. అంతేకాకుండా ఇది TÜV Rheinland Low Blue Light, Circadian Friendly, Flicker Free వంటి సర్టిఫికేషన్లను పొందింది. మరి ఇన్ని ఫీచర్లున్న మొబైల్ పూర్తి ఫీచర్స్, ధరలను ఒకసారి చూసేద్దామా..
శక్తివంతమైన ప్రాసెసర్, స్టోరేజ్:
ఈ రెడ్మీ 15 ఫోన్‌లో Snapdragon 6s Gen 3 SoC ప్రాసెసర్ ను అందించేంచింది కంపెనీ. ఇందులో గరిష్టంగా 8GB RAM + 8GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కలిగి ఉంది. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ గా 128GB లేదా 256GB గా వస్తోంది. అంతేకాకుండా దీనిని 1TB వరకు microSD కార్డ్ ద్వారా స్టోరేజ్ పెంచుకొనే అవకాశం ఉంది.
కెమెరా ఫీచర్లు:
రెడ్మీ 15 5G మొబైల్లో 50MP రియర్ కెమెరా (LED ఫ్లాష్‌తో), ఒక సెకండరీ కెమెరా, అలాగే 8MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2తో నడుస్తుంది. కంపెనీ ప్రకారం ఈ ఫోన్‌కు 2 Android OS అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభించనున్నాయి.
T20 World Cup 2024: బౌండరీ రోప్ వెనక్కి జరిపారు.. సూర్య క్యాచ్‌పై రాయుడు సెన్సేషనల్ కామెంట్స్!
బ్యాటరీ, ఛార్జింగ్:
ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా సిలికాన్-కార్బన్ టెక్నాలజీతో తయారుచేసిన 7000mAh బ్యాటరీ అమర్చబడింది. ఇది ఈ సెక్టార్‌లోనే అతిపెద్ద బ్యాటరీగా నిలవనుంది. అంతేకాకుండా ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 18W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ బ్యాటరీ 1600 ఛార్జింగ్ సైకిళ్ల వరకు నాలుగేళ్ల తరువాత కూడా 80% కెపాసిటీని నిలుపుకుంటుందని షావోమి చెబుతోంది.
డిజైన్ అండ్ కనెక్టివిటీ:
రెడ్మీ 15 5Gలో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ రేటింగ్ ఉన్నాయి. అంతేకూండా ఇందులో డాల్బీ సర్టిఫికేషన్, బాటమ్ ఫైరింగ్ లౌడ్ స్పీకర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ మొబైల్ బరువు 217 గ్రాములు ఉండగా.. 8.4mm మందం మాత్రమే ఉంది.
Guru Nanak University: ఘనంగా గురుణనక్ యూనివర్సిటీ ఓరియెంటెషన్ కార్యక్రమం.. పాల్గొన్న విద్యార్థులు, పేరెంట్స్
ధరలు, లభ్యత:
రెడ్మీ 15 5G మిడ్‌నైట్ బ్లాక్, ఫ్రాస్టెడ్ బ్లాక్, శాండీ పర్పుల్ వంటి మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB + 128GB మోడల్ ధర రూ.14,999 కాగా, 8GB + 128GB మోడల్ ధర రూ.15,999. అలాగే టాప్ వేరియంట్ 8GB + 256GB మోడల్ ధర రూ.16,999గా నిర్ణయించబడింది. వినియోగదారులు ఈ ఫోన్‌ను అమెజాన్, Mi వెబ్ సైట్ తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ స్టోర్లలో ఆగస్టు 28 నుంచి కొనుగోలు చేయవచ్చు.
లాంచ్ ఆఫర్లు:
ఇక లాంచ్ ఆఫర్లలో భాగంగా.. HDFC, ICICI, SBI బ్యాంక్ కార్డులతో రూ.1000 ఇన్స్టంట్ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా మరో రూ.1000 అదనపు తగ్గింపు పొందే అవకాశం కూడా ఉంది. అలాగే, వినియోగదారులకు గరిష్టంగా 3 నెలల నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.