- గూగుల్ Pixel 10 ఫోన్ లో క్రేజీ ఫీచర్
- శాటిలైట్ ద్వారా వాట్సాప్ కాల్స్

వాట్సాప్ కాల్స్, మెసేజెస్ చేయాలంటే మొబైల్ నెట్ వర్క్ లేదా వైఫై ఉండాల్సిందే. అయితే ఇప్పుడు ఇవేమీ లేకున్నా వాట్సాప్ కాల్స్ చేసుకోవచ్చు. గూగుల్ Pixel 10 క్రేజీ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు Pixel 10 యూజర్లు WhatsAppలో శాటిలైట్ ఆధారిత వాయిస్, వీడియో కాలింగ్‌కు మద్దతు పొందబోతున్నారు. గూగుల్ ఇటీవల తన కొత్త Pixel 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లాంచ్ అయిన కొన్ని రోజుల తర్వాత, కంపెనీ అందరినీ ఆశ్చర్యపరిచే ఈ ఫీచర్‌ను ప్రకటించింది.
గూగుల్ X లో ఒక పోస్ట్ షేర్ చేసి ఈ కొత్త ఫీచర్ గురించి తెలియజేసింది. ఆగస్టు 28 నుంచి పిక్సెల్ 10 సిరీస్‌లో ఈ ఫీచర్ యాక్టివేట్ చేయబడుతుందని కంపెనీ తెలిపింది. వాట్సాప్ కాల్ శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా వచ్చినప్పుడు, మీ ఫోన్ స్టేటస్ బార్‌లో శాటిలైట్ చిహ్నం కనిపిస్తుంది. దీని తరువాత, మీరు సాధారణ నెట్‌వర్క్ లేదా Wi-Fi లో చేసినట్లుగానే కాల్స్‌ను స్వీకరించొచ్చు.
అయితే, ఈ సౌకర్యం పూర్తిగా ఉచితం కాదు. ప్రారంభంలో ఈ ఫీచర్ ఎంపిక చేసిన క్యారియర్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుందని, వినియోగదారులు దీనికి అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని గూగుల్ స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక ఫీచర్‌తో, పిక్సెల్ 10 సిరీస్ వాట్సాప్‌లో ఉపగ్రహ ఆధారిత కాలింగ్‌కు మద్దతు ఇచ్చే ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ప్రస్తుతం, వాయిస్, వీడియో కాల్ ఆప్షన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
వాట్సాప్ ద్వారా ఉపగ్రహం ద్వారా టెక్స్ట్ సందేశాలను పంపే సౌకర్యం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దాని గురించి కంపెనీ ఇంకా సమాచారం ఇవ్వలేదు. కేవలం కాల్ చేయడమే కాకుండా, పిక్సెల్ 10 వినియోగదారులు ఈ టెక్నాలజీని ఉపయోగించి నెట్‌వర్క్ లేకుండా కూడా తమ లొకేషన్ ను షేర్ చేసుకోవచ్చు. మొబైల్ నెట్‌వర్క్ లేని ప్రదేశాలలో ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గూగుల్, నాన్-టెరెస్ట్రియల్ నెట్‌వర్క్ ప్రొవైడర్ స్కైలో మధ్య భాగస్వామ్యం ద్వారా ఇది సాధ్యమైంది.
#Pixel10 has you covered on and off the grid 📍 Pixel devices will be the first to offer voice and video calls on @WhatsApp over a satellite network starting 8/28¹ 🌍 pic.twitter.com/6yDSDMskkK
— Made by Google (@madebygoogle) August 22, 2025