Leading News Portal in Telugu

Itel Zeno 20 Launched in India at Just Rs 5,999 with 90Hz Display, 5000mAh Battery and AI Voice Assistant


  • 6.6 అంగుళాల HD+ IPS డిస్‌ప్లే
  • Octa-core T7100 ప్రాసెసర్
  • మూడు సంవత్సరాల పాటు ఫ్లూయెన్సీ గ్యారంటీ
  • IP54 రేటింగ్, యాంటీ-డ్రాప్ కేస్.
కేవలం రూ.5,999లకే ఇన్ని ఫీచర్స్ ఏంటయ్యా..? కొత్త Itel Zeno 20 లాంచ్!

Itel Zeno 20: ఐటెల్ భారత మార్కెట్‌లో తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఐటెల్ జెనో 20 (Itel Zeno 20)ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఇదివరకు విడుదలైన Zeno 10 మొబైల్ కు సక్సెసర్‌గా లాంచ్ అయ్యింది. రగ్గడ్ డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ స్ప్లాష్, డస్ట్ ప్రొటెక్షన్ కోసం IP54 రేటింగ్ కలిగి ఉండటం ప్రత్యేకత. అంతేకాక యూజర్లకు భద్రత కోసం ప్రత్యేక యాంటీ-డ్రాప్ కేస్ ను కూడా అందిస్తున్నారు. మరి ఇన్ని ఫీచర్లున్న ఈ మొబైల్ పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా..

Itel Zeno 20లో 6.6 అంగుళాల HD+ IPS డిస్‌ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్‌తో ఫోన్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ఫోన్‌లో Octa-core T7100 ప్రాసెసర్ ఉంది. దీనికి కంపెనీ మూడు సంవత్సరాల పాటు ఫ్లూయెన్సీ గ్యారంటీ ఇస్తోంది. ఇది తాజా ఆండ్రాయిడ్ 14 Go ఎడిషన్ పై నడుస్తుంది. అలాగే ఇందులో Aivana 2.0 వాయిస్ అసిస్టెంట్ అందించారు. ఇది హిందీ వాయిస్ కమాండ్లను కూడా సపోర్ట్ చేస్తుంది. యూజర్లు దీని ద్వారా యాప్స్ ఓపెన్ చేయడం, వాట్సాప్ కాల్స్ చేయడం, లెక్కలు పరిష్కరించడం, క్యాప్షన్లు క్రియేట్ చేయడం వంటి పనులు చేయవచ్చు.

Ravi Teja : మాస్ జాతర.. సెప్టెంబర్ లో కూడా లేదు… రిలీజ్ ఎప్పుడంటే

ఈ ఫోన్‌లో 13MP రియర్ కెమెరా (HDR సపోర్ట్, LED ఫ్లాష్), 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. DTS సౌండ్ సపోర్ట్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ మొబైల్ లో 5000mAh బ్యాటరీ Type-C ఛార్జింగ్‌తో అందించబడింది. అలాగే ఈ మొబైల్ లో అదనంగా సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో 3GB / 4GB RAM (5GB / 8GB వర్చువల్ RAM తో), 64GB / 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Pooja Pal: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. నేను హత్యకు గురైతే వారే బాధ్యులు..!

ఈ కొత్త ఐటెల్ Zeno 20లో Find My Phone, Landscape Mode, Dynamic Bar వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ తోపాటు ప్రత్యేక మైక్రోSD స్లాట్ కూడా ఉంది. అలాగే డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, Bluetooth, GPS వంటి ముఖ్యమైన ఆప్షన్లు కల్పించారు. ఇక ధర విషయానికి వస్తే.. Itel Zeno 20 ఆగస్టు 25, 2025 నుండి అమెజాన్ లో మాత్రమే అందుబాటులోకి రానుంది. ఇది స్టార్లిట్ బ్లాక్, స్పేస్ టైటానియం, అరోరా బ్లూ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ వేరియంట్లలో లభ్యం కానుంది. ఇక ధరల పరంగా 64GB + 3GB+5GB RAM వేరియంట్ రూ. 5,999 (250 లాంచ్ డిస్కౌంట్‌తో) లభ్యం అవుతుంది. అలాగే, 128GB + 4GB+8GB RAM వేరియంట్ రూ. 6,899 (300 లాంచ్ డిస్కౌంట్‌తో) అందుబాటులో ఉంటుంది.