- రియల్‌మీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్
- ఆగస్టు 27న కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్
- 10000 ఎంఏహెచ్ బ్యాటరీ, 320W ఫాస్ట్ ఛార్జింగ్

Realme is set to launch 10000mAh Battery Smartphone: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. అతి పెద్ద బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌కు సంబంధించి కంపెనీ ఇటీవల టీజర్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ పేరును రియల్‌మీ ఇంకా రివీల్ చేయలేదు. బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌తో వస్తుందని మాత్రమే పేర్కొంది. ఈ సంవత్సరం ప్రారంభంలో 10000 ఎంఏహెచ్ బ్యాటరీతో కాన్సెప్ట్ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు రియల్‌మీ తెలిపింది.
రియల్‌మీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో కొత్త ఫోన్‌కు సంబందించి ఓ పోస్ట్ చేసింది. సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 27న లాంచ్ కానుంది పేర్కొంది. ‘1x000mAh’ బ్యాటరీ అని రాసుకొచ్చింది. ఆ x బహుశా 10000 ఎంఏహెచ్ బ్యాటరీ అని టెక్ నిపుణులు అంటున్నారు. ఇదే నిజమైతే రియల్‌మీ అతిపెద్ద బ్యాటరీ ఫోన్ ఆ ఫోన్ అవుతుంది. కొత్త స్మార్ట్‌ఫోన్‌కు 320W ఫాస్ట్ ఛార్జింగ్ సప్పోర్ట్ ఉంటుందని తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో కొత్త ఫోన్‌కు సంబందించి అన్ని డీటెయిల్స్ తెలియరానున్నాయి.
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో రియల్‌మీ చైనాలో రియల్‌మీ జీటీ 7 సిరీస్‌ను ప్రారంభించింది. కొన్ని రోజులకు భారతదేశంలో కూడా ఆ సిరీస్ లాంచ్ చేసింది. జీటీ 7 సిరీస్‌లో భాగంగా రియల్‌మీ జీటీ 7, రియల్‌మీ జీటీ 7టీ ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. భారతదేశంలో ఈ హ్యాండ్‌సెట్ సిరీస్‌ను 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో తీసుకొచ్చింది. రాబోయే ఫోన్ ఈ సిరీస్‌లో భాగమవుతుందని భావిస్తున్నారు. బ్యాటరీ మినహా సరికొత్త స్మార్ట్‌ఫోన్ డీటెయిల్స్ ఏమీ తెలియరాలేదు. ఏదేమైనా 10000 ఎంఏహెచ్ బ్యాటరీ అంటే మొబైల్ ప్రియులు పండగ చేసుకోవచ్చు. రియల్‌మీ, ఎంఐ, మోటో ఫోన్స్ బ్యాటరీ లైఫ్ బాగా ఇస్తాయన్న విషయం తెలిసిందే.