
OnePlus Pad 3: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) తాజాగా తన కొత్త టాబ్లెట్ OnePlus Pad 3 ను రెండు నెలల ముందు OnePlus 13s సిరీస్‌తో పాటు భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. అయితే అప్పుడు సేల్ తేదీని వెల్లడించలేదు. తాజాగా కంపెనీ అధికారికంగా ఈ టాబ్లెట్ సెప్టెంబర్ 5 మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకాలు మొదలవుతాయని ప్రకటించింది. దీనిని వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇక ధర వివరాలను కూడా అదే రోజు వెల్లడించే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ ప్యాడ్ 12GB + 256GB మరియు 16GB + 512GB వంటి రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇక ఫ్రొస్టెడ్ సిల్వర్, స్టోర్మ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతాయి. ఈ టాబ్లెట్‌లో 13.2 అంగుళాల 3.4K LCD డిస్‌ప్లే (2,400×3,392 పిక్సెల్స్) ఇవ్వబడింది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్‌నెస్, 540Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. అలాగే ఇందులో కంటి రక్షణ కోసం TÜV Rheinland Eye Care 4.0 సర్టిఫికేషన్ కలిగింది.
Bribe : లంచం మొత్తం లెక్కపెట్టేలోపే… ఏసీబీ వలలో అధికారి..!
ఇక ఈ టాబ్లెట్ Snapdragon 8 Elite చిప్‌సెట్ తో పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో Adreno 830 GPU గేమింగ్ కోసం ఉంది. వన్‌ప్లస్ ప్రకారం ఇది 120fps గేమింగ్ సపోర్ట్ ను అందిస్తుంది. ఇక వన్‌ప్లస్ ప్యాడ్ 3లో గరిష్టంగా 16GB LPDDR5T ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజ్ లభిస్తుంది. ఇక ఈ మొబైల్ Android 15 ఆధారిత OxygenOS 15తో పని చేస్తుంది. ఇందులో గూగుల్ జెమినీ, Circle to Search తో పాటు వన్‌ప్లస్ AI ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇక కెమెరా విభాగంలో వెనుక భాగంలో 13MP సెన్సార్, ముందు భాగంలో 8MP కెమెరా లభిస్తుంది. ఇందులో ఆడియో అనుభవాన్ని మెరుగుపరచడానికి ఏకంగా 8 స్పీకర్లు ఏర్పాటు చేశారు. ఇవి LHDC ఆడియో కోడెక్, Hi-Res Audio Wireless సర్టిఫికేషన్‌తో వస్తాయి. అంతేకాకుండా గ్రాఫీన్ కంపోజిట్ వెపర్ ఛాంబర్స్ ద్వారా థర్మల్ మేనేజ్మెంట్ ఉంటుంది. వన్‌ప్లస్ ప్యాడ్ 3లో 12,140mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే కనెక్టివిటీ కోసం Bluetooth 5.4, Wi-Fi 7, USB Type-C పోర్ట్ అందించబడింది. ఈ టాబ్లెట్ పరిమాణం 289.61×209.66×5.97mm కాగా, బరువు 675 గ్రాములు.
TMC MLA escapes ED: ఈడీకి భయపడి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకిన ఎమ్మెల్యే..