Leading News Portal in Telugu

Samsung Galaxy A07 Launched with 6 Years of Security Updates and 50MP Camera at Budget Price


  • శాంసంగ్ గెలాక్సీ A07 ను విడుదల.
  • 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్
  • MediaTek Helio G99 6nm ప్రాసెసర్
  • 5000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • 6 జనరేషన్స్ OS అప్డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ .
6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్, 50MP కెమెరాతో Samsung Galaxy A07 బడ్జెట్ ధరలో లాంచ్!

Samsung Galaxy A07: శాంసంగ్ తన A సిరీస్ లోకి కొత్త బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్ Galaxy A07ను ఇండోనేషియాలో లాంచ్ చేసింది. ఇది ఇదివరకు వచ్చిన Galaxy A06 కు అప్డేటెడ్ మోడల్. తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందించడం ఈ ఫోన్ ప్రత్యేకత. ఇక ఈ Galaxy A07లో డిస్ప్లే, డిజైన్ విషయానికి వస్తే.. ఇందులో 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే (720 × 1600 పిక్సెల్స్ రిజల్యూషన్) ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. మొబైల్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. మొబైల్ పరిమాణం 164.4×77.4×7.6 mm కాగా, బరువు కేవలం 184 గ్రాములు మాత్రమే.

Pakistan Team: పాకిస్తాన్ జట్టు ప్రకటన.. ఏడుగురు ప్లేయర్స్‌కు ఇదే మొదటిసారి! కప్ గెలుస్తారా భయ్యా

ఇక ఈ కొత్త మొబైల్ వర్షన్ లో ఇప్పటి వరకు ఉన్న Helio G85 SoC ను మార్చి, కొత్త MediaTek Helio G99 6nm ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా One UI 7 పై పనిచేస్తుంది. ముఖ్యంగా, శాంసంగ్ మొదటిసారి బడ్జెట్ ఫోన్‌లోనే 6 జనరేషన్స్ OS అప్డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుందని తెలిపింది. ఇక మొబైల్ లో కెమెరా వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా (f/1.8 అపర్చర్) తో పాటు 2MP డెప్త్ సెన్సార్ (f/2.4 అపర్చర్) కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ LED ఫ్లాష్ కూడా అందించబడింది. ముందుభాగంలో 8MP కెమెరా (f/2.0 అపర్చర్) కెమెరా ఉంది.

ఈ Galaxy A07లో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అయితే బాక్స్‌లో ఛార్జర్ ఇవ్వలేదు. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, కనెక్టివిటీ కోసం USB Type-C, Wi-Fi 802.11 ac, Bluetooth 5.3, GPS వాంతి ఫీచర్లు ఉన్నాయి. అలాగే మొబైల్ కు IP54 రేటింగ్ తో డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఇక స్టోరేజ్ ఆప్షన్ల విషయానికి వస్తే.. ఇందులో 4GB / 6GB / 8GB RAM వేరియంట్లు ఉండగా.. వీటికి 64GB / 128GB / 256GB స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. microSD ద్వారా దీనిని ఏకంగా 2TB వరకు ఎక్స్‌పాండబుల్ చేసుకోవచ్చు.

Cinema Chettu: సినిమా చెట్టుకు పునర్జీవం

ఈ స్మార్ట్‌ఫోన్ గ్రీన్, లైట్ వైలెట్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇక ధర విషయానికి వస్తే.. 4GB + 64GB మోడల్ ధర Rp. 1,399,000 (రూ.7,530) గా నిర్ణయించబడింది. 4GB + 128GB మోడల్ Rp. 1,649,000 (రూ.8,880) గా, 6GB + 128GB మోడల్ Rp. 1,949,000 (రూ.10,490) గా, 8GB + 256GB మోడల్ Rp. 2,299,000 (రూ.12,380) గా లభ్యమవుతుంది. ఇక లాంచ్ ఆఫర్స్ కింద శాంసంగ్ కొన్ని ప్రత్యేక బెనిఫిట్స్‌ను అందిస్తోంది. ఇండోనేషియాలో Galaxy A07 కొనుగోలు చేసే వారికి ఉచిత 25W ట్రావెల్ అడాప్టర్, 36GB XL డేటా ప్యాకేజీ, అలాగే Samsung Care+ పై 30% డిస్కౌంట్ (1 నుండి 2 సంవత్సరాల ప్రొటెక్షన్) అందించబడుతుంది.