- ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్ సిరీస్
- వచ్చే నెలలో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్
- 17 సిరీస్ లాంచ్‌కు ముందు తగ్గిన ఐఫోన్ 16 ధర

Get Apple iPhone 16 for Just RS 35,000: ‘ఐఫోన్’ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం దగ్గరపడింది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘యాపిల్’ తన ఐఫోన్ 17 సిరీస్‌ను వచ్చే నెలలో లాంచ్ చేయనుంది. 17 సిరీస్ లైనప్‌ను సెప్టెంబర్ 9న లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. టెక్ ప్రపంచం 17 సిరీస్ యాపిల్ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. యాపిల్ కంపెనీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్ సిరీస్‌ను విడుదల చేస్తుంది. దీనికి ముందు పాత మోడల్ ధరలను తగ్గిస్తుంటుంది. ఈసారి కూడా అదే జరిగింది. 17 సిరీస్ లాంచ్‌కు ముందు ఐఫోన్ 16 ధర తగ్గింది.
గతేడాది ఐఫోన్ 16 (128 జీబీ) ఫోన్ భారతదేశంలో రూ. 79,900కు లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ ఫోన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వెబ్‌సైట్‌లో రూ.71,499 వేలకు అందుబాటులో ఉంది. మీకు 11 శాతం తగ్గింపు లభిస్తోంది. కార్డ్ ఆఫర్‌ల ద్వారా మీరు మరింత చౌకగా ఐఫోన్ 16ను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో రూ.7,401 ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అలానే ఐసీఐసీఐ కార్డ్‌తో రూ.4,000 అదనపు డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. డిస్కౌంట్, ఆఫర్ తర్వాత మీరు దాదాపు 10 వేల రూపాయల తక్కువ ధరకు ఐఫోన్ 16ను కొనుగోలు చేయొచ్చు.
ఐఫోన్ 16పై డిస్కౌంట్, ఆఫర్ మాత్రమే కాదు ఎక్స్‌ఛేంజ్ కూడా అందుబాటులో ఉంది. మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం ద్వారా భారీగా తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 15ని ఎక్స్‌ఛేంజ్ చేస్తే 16పై రూ.35,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్‌ఛేంజ్ అనంతరం దాదాపుగా రూ.35 వేలకు మీరు ఐఫోన్ 16ని సొంతం చేసుకోవచ్చు. అయితే మీ పాత ఫోన్ కండిషన్ బాగుండి, ఎలాంటి డామేజ్ లేకుంటేనే మీకు భారీ మొత్తంలో ఎక్స్‌ఛేంజ్ వస్తుంది.