Leading News Portal in Telugu

TCL Z100 Wireless Home Theater With Dolby Atmos FlexConnect Launched in the US


వైర్‌లెస్ స్పీకర్లలో స్మార్ట్ ఆడియో సెటప్.. కొత్త TCL Z100 లాంచ్!

TCL Z100: TCL తన కొత్త Z100 వైర్‌లెస్ హోమ్ థియేటర స్పీకర్ సిస్టమ్ ను అమెరికా మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఇది దేశంలో Dolby Atmos FlexConnect టెక్నాలజీతో వచ్చిన మొట్టమొదటి సిస్టమ్‌గా గుర్తింపు పొందింది. ఈ టెక్నాలజీ ద్వారా వినియోగదారులు స్పీకర్లను గది లోపల ఎక్కడైనా అమర్చుకోవచ్చు. అయినా సరే, సౌండ్ అనుభవం మాత్రం సమానంగా, స్పేషియల్ ఎఫెక్ట్ తో అద్భుతంగా వినిపిస్తుంది.

California: 64ఏళ్ల ఉపాధ్యాయుడికి 215 సంవత్సరాల జైలు శిక్ష.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

TCL Z100 సిరీస్‌ను 2025లో కంపెనీ లాంచ్ చేసిన QD-Mini LED TVలతో సులభంగా కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. ఒక స్పీకర్ ధర 399.99 డాల్లర్స్(రూ.35,100) గా ఉంది. బండిల్ ఆఫర్లలో కూడా ఇది లభిస్తుంది. ప్రస్తుతం అమెరికాలోని ప్రధాన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. అయితే భారత మార్కెట్లోకి వస్తుందో లేదో ఇంకా స్పష్టత లేదు. ఇక ఫీచర్ల విషయానికి వస్తే, Dolby Atmos FlexConnect వల్ల గది డిజైన్, స్పీకర్ అమరిక, కనెక్ట్ చేసిన పరికరాల ఆధారంగా ఆటోమేటిక్‌గా సౌండ్ సెట్ అవుతుంది. అవసరమైతే వినియోగదారులు అదనపు స్పీకర్లను కూడా యాడ్ చేసుకోవచ్చు.

50MP+50MP+32MP కెమెరాలు, 6,500mAh భారీ బ్యాటరీతో వచ్చేసిన Vivo T4 Pro స్మార్ట్‌ఫోన్!

సౌండ్ క్వాలిటీ కోసం TCL కొత్త డిజైన్‌ను తీసుకువచ్చింది. NdFeB రేర్ ఎర్త్ మాగ్నెట్స్, సిల్క్-డోమ్ ట్వీటర్స్, టైట్‌గా చుట్టబడిన అయిన వాయిస్ కాయిల్స్ ను ఉపయోగించారు. ఇది 170W RMS అవుట్‌పుట్ ఇస్తుంది. వీటితోపాటు TCL సంబంధించిన QM8K, QM7K, QM6K QD-Mini LED టీవీలతో ఈ సౌండ్ సిస్టమ్ అనుకూలంగా పనిచేస్తుంది. మొత్తంగా ఈ TCL Z100 వైర్‌లెస్ హోమ్ థియేటర్ సిస్టమ్ సౌండ్ క్వాలిటీ, ఫ్లెక్సిబుల్ స్పీకర్ సెటప్, ఆధునిక టెక్నాలజీతో వినియోగదారులకు మంచి ఆడియో అనుభవాన్ని అందించబోతోంది.