Leading News Portal in Telugu

Blaupunkt Mini LED TVs With Dolby Atmos, 120Hz Display Launched in India Starting at 94,999


థియేటర్ అనుభవం ఇంట్లోనే.. డాల్బీ ఆట్మాస్ సపోర్ట్‌తో Blaupunkt Mini LED టీవీలు వచ్చేశాయ్!

Blaupunkt Mini LED: జర్మని దేశానికి Blaupunkt కంపెనీ భారత్ లో తన కొత్త 65, 75 అంగుళాల Google Mini LED TVs ను లాంచ్ చేసింది. ఈ టీవీలు ఆధునిక టెక్నాలజీతో రూపొందించబడి, వినియోగదారులకు అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందించనున్నాయి. ఈ టీవీల్లో 1.1 బిలియన్ రంగులు, 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100000:1 కాంట్రాస్ట్ రేషియోతో కూడిన డిస్‌ప్లే లభిస్తుంది. 65 అంగుళాల మోడల్‌లో 288 లోకల్ డిమ్మింగ్ జోన్లు, 75 అంగుళాల మోడల్‌లో 540 జోన్లు ఉండటం వల్ల, రంగుల నాణ్యత మరింత సహజంగా కనిపిస్తుంది.

Ganesh Chaturthi 2025: గణేష్ చతుర్థి నాడు చంద్రుణ్ణి అస్సలు చూడొద్దు! పొరపాటున చూస్తే ఏం చేయాలి?

అలాగే ఇందులోని Smart Eye Shield ఫీచర్ ద్వారా హానికరమైన బ్లూ లైట్ తగ్గించి, కళ్లకు రక్షణ కల్పిస్తుంది. వీటిలో డాల్బీ విజన్, HDR10, HLG ఫార్మాట్ సపోర్ట్ ఉన్నాయి. ఆడియో పరంగా చూస్తే ఇందులో 108W సౌండ్ సిస్టమ్ (4 ట్వీటర్లు + 2 సబ్‌వూఫర్లు)తో వస్తాయి. Dolby Atmos, Dolby Digital Plus సపోర్ట్ వల్ల హోమ్ థియేటర్ స్థాయి సౌండ్ అనుభవాన్ని కలిగిస్తాయి.

120Hz రిఫ్రెష్ రేట్, MEMC, ALLM (Auto Low Latency Mode), VRR (Variable Refresh Rate) వంటి ఫీచర్లు గేమింగ్, స్పోర్ట్స్ కంటెంట్ కోసం మరింత మంచి అనుభవాన్ని ఇస్తాయి. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్‌తో పాటు 1000కి పైగా యాప్స్ యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ టీవీలలో Quad-Core MediaTek ప్రాసెసర్, 2GB RAM, 16GB స్టోరేజ్, Google TV OS, Wi-Fi 5, Bluetooth 5.0, HDMI (3), eARC, USB (2), Ethernet, S/PDIF పోర్టులు ఉన్నాయి.

Rajnath Singh Tour In Vishakha : తొలిసారి భారత నౌకాదళంలోకి రెండు యుద్ధ నౌకలు

ఇక టీవీల ధర విషయానికి వస్తే.. ఇందులో 65 అంగుళాల Mini LED TV ధర రూ.94,999 కాగా, 75 అంగుళాల మోడల్ ధర రూ.1,49,999గా నిర్ణయించారు. ఈ టీవీలు ఆగస్టు 28 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్ కార్ట్ లో బుకింగ్‌కి అందుబాటులోకి వస్తాయి. ప్రారంభ ఆఫర్లలో ఎంపిక చేసిన కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులతో 10% డిస్కౌంట్, 6 నెలల వరకు నో-కాస్ట్ EMI సదుపాయం లభిస్తుంది.