
Hisense UX ULED: ప్రపంచ ప్రీమియం టీవీ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన హైసెన్స్ (Hisense) తాజాగా భారత్ లో UX ULED RGB Mini-LED సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఈ సిరీస్‌లో 100 అంగుళాలు, 116 అంగుళాల సైజుల్లో టీవీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ టీవీల ప్రత్యేకత విషయానికి వస్తే.. వీటిలో RGB Mini-LEDs ద్వారా వేల సంఖ్యలో డిమ్మింగ్ జోన్లతో 95% BT.2020 కలర్ కవరేజ్, గరిష్టంగా 8,000 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది. దీంతో ప్రతి విజువల్ మరింత స్పష్టంగా, సహజంగా కనబడుతుంది. అంతేకాకుండా ఇందులో 3×26-bit డిమ్మింగ్ యాక్యూరసీ ఉండటం వల్ల ఎనర్జీ ఎఫిషియంట్ లైటింగ్, తక్కువ బ్లూ లైట్‌తో కళ్లకు హానికరం కాకుండా ఉంటాయి.
థియేటర్ అనుభవం ఇంట్లోనే.. డాల్బీ ఆట్మాస్ సపోర్ట్‌తో Blaupunkt Mini LED టీవీలు వచ్చేశాయ్!
ఈ టీవీలు Hisense H7 పిక్చర్ ఇంజిన్, Hi-View AI Engine X తో వస్తున్నాయి. ఇవి రియల్ టైమ్‌లో కంటెంట్‌ను బట్టి పిక్చర్, సౌండ్, ఎనర్జీ వినియోగాన్ని సర్దుబాటు చేస్తాయి. విజువల్ అనుభవం కోసం PANTONE™ Validation తో 3D Colour Master PRO, HDR10+, Dolby Vision IQ, IMAX Enhanced, MEMC వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటితోపాటు గేమింగ్ కోసం ప్రత్యేకంగా 165Hz Game Mode Ultra, VRR, FreeSync Premium Pro, Nvidia G-Sync సపోర్ట్ అందుబాటులో ఉంది. అలాగే ఇందులోని Game Bar ద్వారా లైవ్‌లోనే గేమ్ పనితీరును మానిటర్ చేయవచ్చు.
ఇక టీవీల ఆడియో విషయంలో 6.2.2 CineStage X Surround System, Devialet భాగస్వామ్యంతో రూపొందించబడింది. ఇందులో టాప్-ఫైరింగ్ స్పీకర్లు, సబ్‌వూఫర్, Dolby Atmos, WiSA SoundSend, 110W సౌండ్ అవుట్‌పుట్ తో ఇంట్లోనే థియేటర్ అనుభవం పొందవచ్చు. స్మార్ట్ ఫీచర్లలో Google TV, Alexa, Google Assistant, Apple HomeKit లేదా AirPlay సపోర్ట్ ఉన్నాయి.
Rohit Sharma: ఓ పథకం ప్రకారం.. రోహిత్‌ను టీమ్ నుంచి తప్పించాలనుకుంటున్నారు!
ఈ టీవీలకు 28 భాషల సపోర్ట్‌తో పాటు 8 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్ గ్యారంటీ లభిస్తుంది. ఇందులో ప్రత్యేకంగా పర్యావరణ స్నేహపూర్వకంగా ఉండే సోలార్ పవర్డ్ USB-C రిమోట్ కూడా అందిస్తున్నారు. ఈ హైసెన్స్ UX ULED RGB-MiniLED సిరీస్ ధరల విషయానికి వస్తే ఇవి.. రూ.9,99,999 నుండి రూ.29,99,999 వరకు ఉంటాయి. ఈ టీవీలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తోపాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైలర్లలో కూడా అందుబాటులో ఉన్నాయి.