
Oppo Find X9: అతి త్వరలో ఒప్పో తన కొత్త ఫ్లాగ్‌షిప్ Oppo Find X9 సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. గత సంవత్సరం విడుదలైన Find X8 మోడల్‌కు సక్సెసర్‌గా రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటికే లీక్‌ల వివరాలు బయటికి వచ్చాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా తాజా రిపోర్టులు ఈ ఫోన్ ప్రత్యేకతలపై స్పష్టతనిస్తున్నాయి. Find X9తో పాటు Find X9 Pro కూడా రానుండగా, Find X9 Ultra మోడల్‌ను 2026 ఆరంభంలో విడుదల చేసే అవకాశముంది.
డిస్‌ప్లే:
Oppo Find X9లో 6.59 అంగుళాల LTPO OLED డిస్‌ప్లే 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందించనున్నారు. అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ సెక్యూరిటీ కోసం ఉంటుందని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ Android 16 ఆధారిత ColorOS 16 పై నడుస్తుంది. ఇక ఈ మొబైల్ లో MediaTek Dimensity 9500 SoC ప్రాసెసర్‌ని ఉపయోగించనున్నారు. ఇదే చిప్‌సెట్ Find X9 Proలో కూడా ఉండనుంది.
Bandi Sanjay : వరద బాధితులకు అండగా నిలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్
బ్యాటరీ:
బ్యాటరీ పరంగా Find X9, Find X8 కంటే గణనీయమైన అప్‌గ్రేడ్ అందుకోబోతోంది. Find X8లో 5,630mAh బ్యాటరీ ఉండగా, Find X9లో 7,025mAh భారీ బ్యాటరీని అమర్చనున్నారు. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.
కెమెరా సెటప్:
ఫోటోగ్రఫీ విషయంలో ఒప్పో ఈసారి మరింత శ్రద్ధ పెట్టింది. Hasselblad బ్రాండెడ్ కెమెరా యూనిట్ తోపాటు ఒప్పో Lumo ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. రియర్ కెమెరా సెటప్‌లో 50MP Sony LYT-808 ప్రైమరీ కెమెరా (OIS తో), 50MP Samsung JN5 అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP Samsung JN9 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్, OIS తో), అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP Samsung JN1 ఫ్రంట్ కెమెరాని అందించనున్నారు.
ఇతర ఫీచర్లు:
Oppo Find X9లో కొత్త Plus Key అనే ప్రత్యేక ఫీచర్ రానుందని లీక్‌లు సూచిస్తున్నాయి. ఇది Find X8లో ఉన్న అలెర్ట్ స్లయిడర్ కంటే అప్‌గ్రేడ్‌గా భావిస్తున్నారు. అంతేకాకుండా, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, మెరుగైన X-axis లీనియర్ మోటార్ హాప్టిక్స్, IP68 + IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా కల్పించనున్నారు.
PM Svanidhi: చిరు వ్యాపారులకు శుభవార్త.. పీఎం స్వనిధి స్కీమ్ గడువు పెంపు! అంతేకాదు..?
ఒప్పో గత సంవత్సరం Find X8 సిరీస్‌ను చైనాలో అక్టోబర్‌లో విడుదల చేసి, ఆ తరువాత నవంబరులో భారత్‌లో ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో Find X9 సిరీస్‌ను ఈ ఏడాది అక్టోబర్‌లో చైనాలో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే భారతీయ మార్కెట్లో లాంచ్ తేదీపై స్పష్టత లేదు. ఇక Find X9 Ultra మోడల్ 2026 ఆరంభంలో అందుబాటులోకి రానుంది.