
Realme P4 Pro: గత వారం లాంచ్ అయిన Realme P4 Pro 5G ఫోన్‌కు భారీ స్పందన లభిస్తోంది. ఆగస్టు 27న మధ్యాహ్నం 12 గంటలకు తొలి సేల్ జరిగిన తరువాత, రియల్‌మీ మరోసారి వినియోగదారులకు భారీ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే.. ఆగస్టు 29న మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు (12 గంటల ప్రత్యేక సేల్) నిర్వహిస్తోంది. ఈ సేల్‌లోనూ మొదటి సేల్‌లాగే ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయి.
Realme P4 Pro 5G మూడు స్టోరేజ్ వెరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 12GB + 256GB మోడల్ ధర రూ.28,999 కాగా, ఇందులో బ్యాంక్ ఆఫర్‌గా రూ.3,000, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌గా రూ.2,000 తగ్గింపు, అలాగే 3 నెలల నో-కాస్ట్ EMI సౌకర్యం లభిస్తుంది. ఈ ఆఫర్లతో ధర కేవలం రూ.23,999గా వస్తుంది. 8GB + 256GB వెరియంట్ ధర రూ.26,999 ఉండగా, ఆఫర్‌లో ఇది రూ.21,999కు దొరుకుతుంది. ఇక 8GB + 128GB వెరియంట్ అసలు ధర రూ.24,999గా ఉండగా, ఆఫర్ ధరతో ఇది కేవలం రూ.19,999 లకు మాత్రమే లభిస్తుంది. ఇలా Realme P4 Pro ప్రారంభ ధర రూ.19,999 నుంచే వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, రియల్ మీ, ప్రధాన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
7,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాలతో రాబోతున్న Oppo Find X9 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్!
Realme P4 Pro 5Gలో 6.8 అంగుళాల OLED డిస్‌ప్లే (2800×1280 పిక్సెల్స్), 144Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 6500 నిట్స్ బ్రైట్‌నెస్, Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇందులో ప్రాసెసర్‌గా Qualcomm Snapdragon 7 Gen 4 (4nm), Adreno 722 GPU కలిగి ఉంది. ఇక ఈ మొబైల్ Android 15 ఆధారిత realme UI 6.0పై నడుస్తుంది. ఇక కెమెరా విషయంలో 50MP Sony IMX896 OIS ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ రియర్ వైపు ఉంటే, 50MP OV50D ఫ్రంట్ కెమెరా సెల్ఫీల కోసం ఉంది. రెండూ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి.
ఇతర ఫీచర్లలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, Hi-Res ఆడియో, IP68 + IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, Wi-Fi 6, Bluetooth 5.4 ఉన్నాయి. ఇందులో 7000mAh పవర్‌ఫుల్ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మిడ్ రేంజ్ లో బెస్ట్ ఫోన్ కోసం చూస్తుంటే.. ఈ ఫోన్ ను మిస్ చేసుకోవద్దు.
ప్రీమియం ఫీచర్లతో Moto Buds Loop, బడ్జెట్ ఫ్రెండ్లీలో Moto Buds Bass లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా!