Leading News Portal in Telugu

High Entertainment at Low Price: BSNL BiTV Premium Pack with 25 OTTs and 450+ Live Channels Launched at Rs.151 only


తక్కువ ధరలో హై ఎంటర్టైన్మెంట్.. 25 OTTలు, 450+ లైవ్ ఛానెల్స్‌తో BSNL BiTV ప్రీమియం ప్యాక్ లాంచ్!

BSNL BiTV: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన BiTV సేవకు కొత్త ప్రీమియం ప్యాక్ ను తీసుకవచ్చింది. ఈ సేవను ఫిబ్రవరిలో ప్రారంభించగా ఇప్పటివరకు ఇది ట్రయల్ దశలో ఉచితంగా అందుబాటులో ఉండేది. ఇక తాజాగా BSNL కొత్త ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు ఒకే యాప్‌లో ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లు, లైవ్ టీవీ ఛానెల్స్ యాక్సెస్ చేయగలరు.

Xi Jinping India Letter: భారత్‌కు జిన్‌పింగ్ రహస్య లేఖ.. అమెరికా గురించి ఏం చెప్పారంటే..

ధర, ప్రయోజనాలు:
BSNL తన ఎక్స్ (X) పోస్ట్ ద్వారా ప్రకటించిన ప్రకారం ఈ కొత్త BiTV ప్రీమియం ప్యాక్ ధర కేవలం రూ.151. ఈ ప్యాక్‌తో వినియోగదారులు 25కి పైగా OTT ప్లాట్‌ఫారమ్‌లు, 450కుపైగా లైవ్ టీవీ ఛానెల్స్ చూడగలరు. అయితే ఈ ప్యాక్‌కు గల వాలిడిటీ వ్యవధిపై BSNL ఇంకా అధికారిక వివరాలు వెల్లడించలేదు. BiTV ద్వారా వినియోగదారులు Aha, ZEE5, SonyLIV, Sheemaroo, Sun NXT, Chaupal, Lionsgate, ETV Win, Discovery, Epic ON వంటి ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్‌ను ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో చూడవచ్చు.

డోంట్ మిస్.. ప్రత్యేకంగా Realme P4 Pro 12 గంటల సేల్‌.. కేవలం రూ.19999 నుంచి మొదలు

మరో చౌకైన ప్లాన్:
BSNL మరిన్ని తక్కువ ధరలోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్లను కూడా అందిస్తోంది. అందులో భాగంగా కేవలం రూ.28 ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఇది 30 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. దీన్ని పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. ఈ సబ్‌స్క్రిప్షన్‌తో Lionsgate Play, ETV Win, VROTT, Premiumflix, Nammflix, Gujari, Friday వంటి 7 OTT ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు 9 complimentary OTTలు కూడా లభిస్తాయని సమాచారం. మొత్తంగా, BSNL BiTV సర్వీస్‌తో వినియోగదారులు వేర్వేరు OTTలకు వేరువేరుగా చెల్లించాల్సిన అవసరం లేకుండా, ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో విభిన్న కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు.