
BSNL: ఈ మధ్య కాలంలో టెలికాం సంస్థలు వాటి టారిఫ్లను పెంచుతూ పోతున్నాయి. కనీస రీచార్జ్ ప్లాన్లు ధరలను సవరించడమే కాకుండా ఏకంగా కొన్ని ప్లాన్లను రద్దు కూడా చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ బిస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని అత్యంత చవకైన రీచార్జ్ ప్లాన్ మార్కెట్ లోకి తీసుక వచ్చింది.
ATOR N1200 Amphibious Vehicles: ఇండియన్ ఆర్మీ సూపర్ వెహికిల్స్.. వరదల్లోనూ రయ్ రయ్..
కేవలం రూ.147 లకే నెల రోజుల వ్యాలిడిటీతో ఈ కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ వివరాల్లోకి వెళ్తే.. కేవలం 147 రూపాయలతో రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీనితో నెల రోజుల పాటు దేశంలోని ఏ నెట్వర్క్ అయినా సరే అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు 10 GB హై స్పీడ్ డేటాను కూడా వాడుకోవచ్చడోయ్.. రోజుకు కేవలం 5 రూపాయల ఖర్చుతో వినియోగదారులు ఈ ప్రయోజనాలను పొందవచ్చు.
జలుబు ఎందుకు వస్తుంది? జలుబు వెనక ఉన్న అసలు నిజం.ఏం తింటే తగ్గుతుంది?
అయితే, ఈ ప్లాన్ లో ఒక పరిమితి ఉంది. అదేంటంటే.. కేటాయించిన 10 GB డేటా పూర్తిగా వినియోగం అయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 kbps కు తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువ ఇంటర్నెట్ వాడే వారికి ఈ ప్లాన్ అంతగా సెట్ కాదు. కానీ, ప్రధానంగా వాయిస్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుతూ పరిమితంగా డేటా వాడే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం పెరుగుతున్న రీచార్జ్ ధరల దృష్ట్యా బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ ప్లాన్ బడ్జెట్ వినియోగదారులను బాగా ఆకట్టుకుంటుంది.