Leading News Portal in Telugu

AKAI Launches PowerView Series TVs in India.. Dolby Vision, Google TV (Android 14), 75-inch QLED


డాల్బీ విజన్, గూగుల్ అసిస్టెంట్ లతో వచ్చేసిన AKAI PowerView సిరీస్ టీవీలు!

AKAI PowerView TVs: ప్రసిద్ధ ఎలక్ట్రానిక్ బ్రాండ్ ఆకై (AKAI) భారత మార్కెట్లోకి తన టీవీల లైనప్‌ను విస్తరించింది. కొత్తగా విడుదల చేసిన ఈ PowerView సిరీస్ టీవీలు తాజా Google TV (Android 14) ప్లాట్‌ఫాం మీద రన్ అవుతాయి. ఈ సిరీస్‌లో 32 అంగుళాల HD రెడీ, 43 అంగుళాల 4K మోడల్, అలాగే భారీ 75 అంగుళాల QLED డిస్ప్లే లభిస్తున్నాయి.

PowerView సిరీస్‌లో MediaTek MT9603 చిప్‌సెట్ లభించనుంది. ఈ టీవీలు HDR10, Dolby Vision, HLG సపోర్ట్ చేస్తాయి. MEMC టెక్నాలజీ వల్ల పిక్చర్ క్వాలిటీ స్మూత్‌గా కనిపిస్తుంది. Google TVలో డైనమిక్ కలర్ కరెక్షన్, ఫాంట్ కస్టమైజేషన్ వంటి సౌకర్యాలు కలవు. వీటి ద్వారా కలర్ ఇంపెయిర్మెంట్ ఉన్నవారు, వయోవృద్ధులు సులభంగా ఉపయోగించుకోవచ్చు.

Baahubali The Epic : కీలక సన్నివేశాలు లేపేసిన జక్కన్న.. ఇది నీకు న్యాయమా..

తాజా Android 14లో మల్టీ లాంగ్వేజ్ సబ్‌టైటిల్ సపోర్ట్, గూగుల్ అసిస్టెంట్ వాయిస్ సెర్చ్, క్విక్ యాప్ యాక్సెస్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. అలాగే గూగుల్ డివైజెస్‌తో ఇన్టిగ్రేషన్ సులభంగా చేసుకోవచ్చు. జెస్చర్ కంట్రోల్స్, Miracast, న్యూ క్యాస్ట్ సపోర్ట్ ద్వారా మొబైల్ నుండి లో-లాటెన్సీ కాస్టింగ్ చేయవచ్చు.

ఈ కొత్త AKAI PowerView Series టీవీలు వివిధ సైజుల్లో లభిస్తున్నాయి. వీటిలో 32 అంగుళాల HD మోడల్, అలాగే 43″, 50″, 55″, 65″, 75″ 4K QLED మోడల్స్ ఉన్నాయి. డిస్ప్లే విషయానికి వస్తే.. 32″ మోడల్ 1366×768 రిజల్యూషన్, 3000:1 కాంట్రాస్ట్ రేషియోతో వస్తుండగా, 43 అంగుళాల నుంచి పై మోడల్స్ 3840×2160 రిజల్యూషన్, 120Hz గేమ్ మోడ్, డాల్బీ విజన్, MEMC సపోర్ట్‌తో వస్తాయి. స్టోరేజ్ పరంగా 32″ మోడల్ 1.5GB RAM, 8GB స్టోరేజ్‌తో లభిస్తుండగా.. 43″ నుంచి పై మోడల్స్ 2GB RAM, 32GB స్టోరేజ్‌ను అందిస్తున్నాయి.

ఆడియో విభాగంలో డాల్బీ, డిజిటల్, డిజిటల్+ సపోర్ట్ ఉంటే.. 43″ పై మోడల్స్ డాల్బీ ఆటం సౌండ్‌ను అందిస్తాయి. ఇవన్నీ Google TV (Android 14) ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తాయి. కనెక్టివిటీ ఫీచర్లలో HDMI పోర్టులు (32″లో 2, ఇతర మోడల్స్‌లో 3), USB x2, LAN, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. వీటితోపాటు గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ క్యాస్ట్, మిర క్యాస్ట్ (32″ మోడల్‌లో అందుబాటులో లేదు), పేరెంటల్ కంట్రోల్, ఫాస్ట్ బూట్, ట్యూనర్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి.

Home Insurance: ఇది విన్నారా..? కేవలం రూ.181కే మీ ఇంటికి భీమా సదుపాయం.. ఎలా చేసుకోవాలంటే!

ఇక ధరల విషయానికి వస్తే, AKAI PowerView Series టీవీలు రూ.13,990 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇవి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆఫ్లైన్ రిటైలర్ల వద్ద, అలాగే akaiindia అధికారిక వెబ్‌సైట్‌లో లభిస్తున్నాయి.