Moto Buds Loop with Premium Features and Moto Buds Bass with ANC Launched in India.. Check Price and Specs!

Moto Buds Loop, Moto Buds Bass: మోటరోలా (Motorola) తాజాగా రెండు కొత్త ట్రూ వైర్లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్ లను లాంచ్ చేసింది. అవే.. మోటో బడ్స్ లూప్ (moto buds Loop), మోటో బడ్స్ బాస్ (moto buds Bass). ఈ రెండు మోడళ్లూ వేర్వేరు ఫీచర్లతో, డిజైన్‌లతో వినియోగదారులను ఆకర్షించనున్నాయి. మరి ఈ రెండు TWSల గురించి పూర్తి వివరాలను చూద్దాం.
మోటో బడ్స్ లూప్ (moto buds Loop):
మోటో బడ్స్ లూప్ ఓపెన్-ఇయర్ డిజైన్‌తో వస్తుంది. మెమరీ అలాయ్ ఫ్రేమ్, IP54 వాటర్ రెసిస్టెన్స్, Bose ట్యూన్ చేసిన 12mm ఐరన్‌లెస్ డ్రైవర్లు, EVO సర్టిఫికేషన్, Spatial ఆడియో సపోర్ట్ ఇందులో ప్రధాన ఆకర్షణలు. స్పష్టమైన కాల్స్ కోసం CrystalTalk AI డ్యూయల్ మైక్రోఫోన్ సిస్టమ్ ను అందించారు.
7,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాలతో రాబోతున్న Oppo Find X9 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్!
ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటలు, కేసుతో కలిపి 39 గంటలు ప్లేబ్యాక్ లభిస్తుంది. 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జ్‌తో 3 గంటల మ్యూజిక్ వినవచ్చు. మోటో AI, స్మార్ట్ కనెక్ట్, వాయిస్ కమాండ్స్, మల్టీ-డివైస్ పెయిరింగ్‌కు ‘మోటో బడ్స్’ యాప్ ద్వారా సపోర్ట్ ఉంటుంది. వీటి ధర రూ.7,999 (బ్యాంక్ ఆఫర్‌తో రూ.6,999)గా నిర్ణయించారు. సెప్టెంబర్ 1 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, ఫ్లిప్ కార్ట్, మోటోరోలా, రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులోకి రానున్నాయి.
మోటో బడ్స్ బాస్ (moto buds Bass):
మోటో బడ్స్ బాస్ 12.4mm బాస్-ట్యూన్ డ్రైవర్లు, Hi-Res LDAC ఆడియో సపోర్ట్‌తో వస్తుంది. ఇది కూడా IP54 వాటర్ రెసిస్టెంట్ కలిగి ఉంది. డార్క్ షాడో, బ్లూ జ్యుయల్, పోసి గ్రీన్ కలర్లలో లభ్యం అవుతాయి. ఈ ఇయర్‌బడ్‌లో True Active Noise Cancellation (ANC) ఫీచర్ ఉంది. ఇది గరిష్టంగా 50dB వరకు ANC అందించగలదు. నాయిస్ క్యాన్సలింగ్, ట్రాన్స్పరెన్సీ, అడాప్టివ్, ఆఫ్ అనే మోడ్‌లను యూజర్లు ఎంచుకోవచ్చు. అంతేకాకుండా Adaptive ANC పరిసర పరిస్థితులకు అనుగుణంగా సౌండ్‌ను సర్దుబాటు చేస్తుంది. కాల్స్ కోసం ఒక్కో ఇయర్‌బడ్‌లో మూడు మైక్రోఫోన్‌లు ఉండగా, CrystalTalk AI, ENC, Wind Noise Filter సపోర్ట్ ఉంటుంది.
TCS Bengaluru Lease Deal: అద్దె రూ.2,130 కోట్లు.. టీఎసీఎస్ నయా రికార్డ్..
ఇక ఇందులో బ్యాటరీ లైఫ్ పరంగా.. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ANC ఆఫ్‌లో 9 గంటలు, కేసుతో కలిపి 43 గంటలు లభిస్తుంది. 10 నిమిషాల క్విక్ ఛార్జ్‌తో 2 గంటల ప్లేబ్యాక్ లభిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ Bluetooth 5.3, Google Fast Pair కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుంది. వీటి ధరను రూ.1,999గా నిర్ణయించారు. ఇవి సెప్టెంబర్ 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్, మోటోరోలా, రిటైల్ అవుట్‌లెట్లలో లభ్యమవుతాయి.