- గ్లోబల్గా HONOR Magic V5 ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ లాంచ్.
- 7.95 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 6.43 అంగుళాల అవుటర్ స్క్రీన్
- AI ఫీచర్లు, అత్యాధునిక కెమెరా.

HONOR Magic V5: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలలో ఒకటైన హానర్ (HONOR) తాజాగా ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ హానర్ మ్యాజిక్ V5 (HONOR Magic V5)ను గ్లోబల్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. గత మోడల్ మ్యాజిక్ V3 స్టార్మ్ ను కొనసాగిస్తూ ఈసారి డిజైన్, మన్నిక, AI ఇంటిగ్రేషన్, బ్యాటరీ, కెమెరా విభాగాల్లో మరింత అప్డేట్స్ ను తీసుకొచ్చింది. మరి ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాలను పూర్తిగా తెలుసుకుందాము.
డిజైన్, డిస్‌ప్లేలు:
ఈ ఫోన్‌లోని Ivory White వెర్షన్ అత్యంత స్లిమ్‌గా ఉండి ఫోల్డ్ చేసినప్పుడు 8.8mm, అన్‌ఫోల్డ్ చేసినప్పుడు 4.1mm మాత్రమే ఉండేలా డిజైన్ చేయబడింది. ఈ మొబైల్ బరువు కేవలం 217 గ్రాములు మాత్రమే. ఇందులో 7.95 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 6.43 అంగుళాల అవుటర్ స్క్రీన్ ఉండగా.. రెండింటికీ స్టైలస్ సపోర్ట్ ఉంటుంది. ఈ మొబైల్ లో Multi-Flex Mode సహాయంతో ఒకేసారి మూడు యాప్‌లను రన్ చేయవచ్చు.
Jio IPO: 2026లో ఐపీఓకు జియో.. ముఖేష్ అంబానీ ఏం చెప్పారంటే..
రెండు డిస్‌ప్లేలు HDR Vivid, డాల్బీ విజన్, ZREAL సపోర్ట్ చేయడమే కాకుండా 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగివున్నాయి. అలాగే వీటిలో 4320Hz PWM డిమ్మింగ్, మోషన్ రిలీఫ్, నేచురల్ లైట్ అడ్జస్ట్మెంట్, LTPO ఐ ప్రొటెక్షన్‌తో వినియోగదారుల కళ్లకు హానికరం కాకుండా రూపొందించారు.
AI ఫీచర్లు:
MagicOS 9.0 లో భాగంగా Google Gemini ఇందులో పొందుపరిచారు. డబుల్-టాప్ షార్ట్‌కట్, AI ఆధారిత హానర్ నోట్స్, రియల్-టైమ్ ట్రాన్స్‌క్రిప్షన్, ట్రాన్స్‌లేషన్, అలాగే AI ఇమేజ్ టూ వీడియో, AI కట్ అవుట్ వంటి క్రియేటివ్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫోన్‌లో ఉన్న సూపర్ స్టీల్ హింగ్ 5 లక్షల కంటే ఎక్కువ ఫోల్డ్స్‌ను తట్టుకునేలా డిజైన్ చేయబడింది.
అత్యాధునిక కెమెరా:
HONOR Magic V5 లోని AI Falcon కెమెరా సిస్టంలో 64MP పెరిస్కోప్ టెలిఫోటో (3x OIS, 100x డిజిటల్ జూమ్ వరకు), 50MP మెయిన్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్‌లు ఉన్నాయి. AI ఇమేజ్ ఇంజిన్ సహాయంతో AI ఎన్హన్సడ్ పోర్ట్రైట్, AI సూపర్ జూమ్, మోషన్ సెన్సింగ్ కాప్చర్ లాంటి అధునాతన ఫోటోగ్రఫీ ఫీచర్లు లభిస్తాయి. ఇక మొబైల్ ముందు భాగంలో 20MP కెమెరాను ఇన్నర్, అవుటర్ డిస్‌ప్లేలకు అందించారు.
iPhone 17 Price: యాపిల్ లవర్స్‌కు షాక్.. ఐఫోన్ 17 సిరీస్ ధరల పెంపు! ఎంతో తెలుసా?
ఇక ఈ ఫోన్‌లో Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంది. అలాగే ఇందులో 5820mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వీటితోపాటు IP58, IP59 రేటింగ్స్, యాంటీ స్క్రాచ్ నానోక్రిస్టల్ షీల్డ్, కార్బన్ ఫైబర్ రెయిన్ ఫోర్స్డ్ ఇన్నర్ పనెల్ ఫోన్‌కు అదనపు రక్షణగా నిలుస్తాయి.
ధర:
HONOR Magic V5 ఐవరీ వైట్, బ్లాక్, డాన్ గోల్డ్, రెడ్డిష్ బ్రౌన్ రంగులలో లభిస్తోంది. 16GB + 512GB వేరియంట్ యూరప్, యుకే మార్కెట్స్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంది. దీని ధర 1,699.99 GBP (రూ.2,01,025) లేదా 1,999 యూరోలు (దాదాపు రూ.2,03,890)గా ఉన్నాయి.