
Upcoming Mobiles: మరో రెండు రోజుల్లో ఆగష్టు నెల ముగియనుంది. సెప్టెంబర్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. మరి సెప్టెంబర్ నెలలో రాబోతున్న మొబైల్స్ గురించి తెలుసుకుందాం. రాబోయే సెప్టెంబర్ స్పెషల్ నెల. ఎందుకంటే, సెప్టెంబర్ లో మీకు బిగ్ బిలియన్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సేల్స్ రాబోతున్నాయి. నిజానికి చాలామంది ఈ సేల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ సేల్ కూడా మీకు సెప్టెంబర్ 15 లోపు ఉండవచ్చు. కచ్చితమైన తేదీలు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు.
ఇక వచ్చే నెలలో లాంచెస్ విషయానికి వస్తే.. అందరూ ఎదురు చూస్తుంది బిగ్ లాంచ్ ఆపిల్ ఐఫోన్స్. అయితే వీటిపై ఇంకా తేదిని అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేయలేదు. సెప్టెంబర్ 9దవ తారీకు ఇవి లాంచ్ అవుతాయని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. వీటిలో ఐఫోన్ 17, 17, 17 Pro, 17 Pro Max మొత్తం నాలుగు ఫోన్స్ అయితే మనం ఆపిల్ నుంచి రావచ్చని అంచనా వేయవచ్చు. వీటితో పాటు ఆపిల్ ఎయిర్ ప్యాడ్స్ తీసుకురావచ్చు.
Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకి భారీ కుట్ర.. బయటకొచ్చిన సంచలన వీడియో!
ఇక సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో సెప్టెంబర్ 4వ తారీకు S25 FE అయితే లాంచ్ అవ్వచ్చు. S25 FE కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కొత్త మొబైల్ రాబోతుంది కాబట్టి ప్రస్తుతం S24 FE ఈ సేల్ లో తక్కువ రేట్ కి వస్తుంది. S24 FE తో కంపేర్ చేస్తే S25 FE కొత్త జనరేషన్ లో కొద్దిగా 200 mh బ్యాటరీ పెంచుతున్నారు. ఇప్పుడు 4,900 mAh బ్యాటరీతో రావచ్చు. అలాగే బ్యాటరీ చార్జింగ్ 25w ఉండేది.. ఇప్పుడు 45W కి పెంచుతున్నారు. వీటితో పాటు ఎఆర్ బడ్స్ కూడా తీసుకురావచ్చు.
ఇక వివో నుంచి Vivo V60 వచ్చింది కదా.. దాని నెక్స్ట్ అప్డేట్ V6E ని తీసున రానునట్లు సమాచారం. ఇది మీడియాటెక్ డైమండ్సిటీ 7400 ప్రాసెసర్ తో వస్తది. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా రెండు 50MP కెమెరాస్ ఉంటాయి.. ఫ్రంట్ బ్యాక్ అండ్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి.కాకపోతే ZISS పార్ట్నర్షిప్ అయితే ఉండదు. V60E లో V60 లో మనకి జైస్ పార్ట్నర్షిప్ ఉంటది. దీనిలో మిస్ అవుతుంది. ఇక లవ నుండి లావాAgni4 కూడా సెప్టెంబర్ మధ్యలో అయితే రావచ్చు. దీని డిజైన్ చూస్తే Samsung Galaxy S10 సిరీస్ అయితే గుర్తొస్తుంది. ఇక దీనిలో స్పెక్స్ వస్తే మెయిన్ బ్యాటరీ హైలైట్ దీనిలో 7,000 mh బ్యాటరీ ఉండనుంది. 66W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఫుల్ హెడిమ్లెట్ డిస్ప్లే డైమండ్సిటీ 850 ప్రాసెసర్ బ్యాక్ సైడ్ 50mp కెమెరా OS తో వస్తుంది. ఫ్రంట్ 16mp కెమెరా ఉండనుంది.
కుటుంబ ప్రయాణ అవసరాలకు సరిపోయే కొత్త Tata Winger Plus లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా!
ఇక Realme నుంచి Realme 15 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని డిజైన్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఐఫోన్ గుర్తు వస్తుంది. 50mp పెరిస్కోపిక్ టెలీఫోటో లెన్స్ కూడా ఉంటాయి దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి mediaటెక్ 6400మాక్స్ అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇంకా పూర్తి వివరాలు దీని గురించి బయటికయితే రాలేదు. వీటితోపాటు సెప్టెంబర్ లో ఒప్పో నుంచి F సిరీస్ వస్తుంది. ఇందులో F31, F31 Pro, F31 Pro Plus మూడు ఫోన్స్ అయితే OPPO నుంచి అయితే రాబోతున్నాయి. ఇవన్నీ మీడియాటెక్ ప్రాసెసర్స్ తో వస్తాయి. ఇవి 7000 mh బ్యాటరీ, 80వా ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రావచ్చు. ఇవి కంప్లీట్ ఆఫ్లైన్ ఫోన్స్ అని చెప్పొచ్చు. ఇంకా వీటి గురించి కూడా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు.