- యాపిల్ లవర్స్‌కు షాక్
- ఐఫోన్ 17 సిరీస్ ధరల పెంపు
- 17 సిరీస్ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న యాపిల్ లవర్స్

Apple iPhone 17 Series Launch and Price Hike: టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమవుతోంది. సెప్టెంబర్ 9న ‘అవే డ్రాపింగ్’ ఈవెంట్‌లో ‘ఐఫోన్’ 17 సిరీస్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈసారి ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ రానున్నట్లు తెలుస్తోంది. గతంతో పోల్చితే.. 17 సిరీస్ ఫోన్లు భారీ అప్‌గ్రేడ్‌లతో రానున్నాయని సమాచారం. దాంతో ఈసారి నాలుగు మోడల్స్ ధరలు పెరగనున్నాయని టెక్ నిపుణులు అంటున్నారు.
ఇటీవల ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో మోడళ్ల యూఎస్ ధరలు లీక్ అయ్యాయి. దాదాపు 50 డాలర్ల పెంపు ఉన్నట్లు సమాచారం. ఐఫోన్ 17 ఫోన్ 128 జీబీ వేరియంట్ ధర 849 డాలర్లు (భారత కరెన్సీలో రూ.84,990) ఉండనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16 ఫోన్ గతేడాది 80 వేలకు లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఐఫోన్ 17 ప్రో ధర 1,049 డాలర్లు (రూ.1,24,990) ఉండనున్నట్లు సమాచారం. ఐఫోన్ 16 ప్రో 999 డాలర్లకు లాంచ్ అయింది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర 1,249 డాలర్లు (రూ.1,50,000)కు పెరగవచ్చని సమాచారం.
ధరలపై యాపిల్ కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే పక్కాగా ధరలు మాత్రం పెరగనున్నాయని ఐఫోన్ టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 17 సిరీస్ లాంచ్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 9న రాత్రి 10.30 గంటలకు ఆరంభం కానుంది. లాంచ్ ఈవెంట్‌ను Apple.com, Apple TVలో వీక్షించవచ్చు. 17 సిరీస్ ఫోన్ల కోసం యాపిల్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 17 సిరీస్ లాంచ్ నేపథ్యంలో 16 సిరీస్ ఫోన్స్ ధరలు తగ్గిన విషయం తెలిసిందే.