Leading News Portal in Telugu

OnePlus Nord 5 vs Poco X7.. Best Mid-Range Smartphone? Specs, Features & Price Compared


OnePlus Nord 5 or Poco X7: బడ్జెట్ ఫ్రెండ్లీ బీస్ట్ లేదా ఫీచర్ ప్యాక్డ్ ప్రో.. ఏ మొబైల్ బెస్ట్?

OnePlus Nord 5 or Poco X7: మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ప్రస్తుతం చాలా కాంపిటేషన్ గా మారింది. ఈ పోటీలో అత్యంత పేరుగాంచిన రెండు మోడళ్లు OnePlus Nord 5, Poco X7 స్మార్ట్ ఫోన్స్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు మొబైల్స్ ఆకట్టుకునే ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో వచ్చాయి. మరి వినియోగదారులకు ఏ మొబైల్ సరిపోతుంది? ఎందుకు అని చూద్దాం..

డిజైన్, డిస్‌ప్లే:
OnePlus Nord 5 లో 6.83 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. అలాగే ఇందులో Gorilla Glass 7i ప్రొటెక్షన్, IP65 రేటింగ్ కూడా ఉంది. ఇక Poco X7 6.67 అంగుళాల QHD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగింది ఉంది. దీన్ని బట్టి చూస్తే.. డిస్‌ప్లే పరంగా Nord 5 స్మూత్ అండ్ బ్రైట్ అనుభవం ఇస్తుంది.

Houthi Leadership Killed: హౌతీలను చావుదెబ్బ కొట్టిన ఇజ్రాయెల్.. ప్రధాన మంత్రితో సహా పలువురు కీలక మంత్రులు ఖతం..

ప్రాసెసర్:
ముందుగా Nord 5లో Snapdragon 8s Gen 3 ప్రాసెసర్, LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ కలిగి ఉంది. దీని వల్ల గేమింగ్, హెవీ యూజ్‌లో ఇది బాగా పనిచేస్తుంది. మరోవైపు Poco X7 మొబైల్ MediaTek Dimensity 8400 అల్ట్రా చిప్‌సెట్ కలిగి ఉంది. అలాగే బెంచ్‌మార్క్స్‌లో ఇది చాలా విభాగాలలో ముందు ఉంది. మొత్తంగా పనితీరు పరంగా Poco X7 కాస్త ముందుంది.

కెమెరా సెటప్:
Poco X7 మొబైల్ లో 50MP IMX882 ప్రైమరీ, 8MP అల్ట్రా-వైడ్, 20MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మరోవైపు Nord 5 మొబైల్ లో 50MP Sony OIS LYT-700 ప్రైమరీ, 8MP అల్ట్రా-వైడ్, 50MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. కాబట్టి బ్యాక్ కెమెరాగా రెండు ఒకటే అయినా.. సెల్ఫీల కోసం Nord 5 బెస్ట్.

బ్యాటరీ & ఛార్జింగ్:
Poco X7 మొబైల్ లో 6000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జర్ ఉన్నాయి. అలాగే Nord 5 మొబైల్ లో 6800mAh భారీ బ్యాటరీ, 80W SUPERVOOC, రివర్స్ ఛార్జింగ్. 45 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్. దీన్ని బట్టి చూస్తే.. ఛార్జింగ్ స్పీడ్‌లో Poco X7, బ్యాకప్‌లో Nord 5 బెస్ట్.

సాఫ్ట్‌వేర్ & అప్‌డేట్స్:
Nord 5 మొబైల్ లో OxygenOS 15 (Android 15), Google Gemini AI, Plus Key. 4 సంవత్సరాల మెజర్ అప్‌డేట్స్ ఉంటాయి. ఇక Poco X7 మొబైల్ లో HyperOS 2 (Android 14), 3 సంవత్సరాల అప్‌డేట్స్ ఉన్నాయి. దీన్ని గమనిస్తే.. సాఫ్ట్‌వేర్ సపోర్ట్ అండ్ లాంగ్-టర్మ్ అప్‌డేట్స్‌లో Nord 5 ముందుంది.

రుచిగా అనిపించినా జంక్ ఫుడ్ కి బానిసైతే..ఆరోగ్యానికి శత్రువే!

ధరలు:
Nord 5 మొబైల్ రూ.31,999 నుంచి మొదలుతుండగా.. Poco X7 మొబైల్ రూ.25,990 నుంచి మొదలవుతుంది. కాబట్టి తక్కువ ధరలో పనితీరు కావాలంటే Poco X7, కానీ ప్రీమియం అనుభవం, ఫీచర్లు కావాలంటే Nord 5 బెస్ట్.

ఏది కొనాలి?
బెటర్ డిస్ప్లే, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, మంచి సెల్ఫీలు కావాలంటే OnePlus Nord 5 ఎంచుకోవచ్చు. అదే ఫాస్ట్ ఛార్జింగ్, తక్కువ ధరలో మొబైల్ మంచి పనితీరు కావాలంటే Poco X7 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి ఈ రెండు మొబైల్స్ లో ఎంపిక మీ బడ్జెట్, అవసరాలపై ఆధారపడి ఉంటుంది.