Leading News Portal in Telugu

Samsung Galaxy F17 5G Specs and Price Leak Ahead of Launch


లాంచ్ కి ముందే Samsung Galaxy F17 5G లీకైన స్పెసిఫికేషన్స్, ధరలు!

Samsung Galaxy F17 5G: శాంసంగ్ అతి త్వరలో వారి గెలాక్సీ సిరీస్ లో భాగంగా F17 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుక రానున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ గెలాక్సీ M17 5G కు సంబంధించి కొన్ని కీలక స్పెసిఫికేషన్లు, అంచనా ధరలు కూడా లీకయ్యాయి.. అయితే అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. ఓ నివేదిక ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ F17 5G బేస్ వెర్షన్ (4GB RAM + 128GB స్టోరేజ్) ధర సుమారు రూ.14,499గా ఉండవచ్చని చెప్పబడుతోంది. అదేవిధంగా 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.15,999 ధర ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

డిస్‌ప్లే & డిజైన్:
ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల Full HD+ సూపర్ AMOLED డిస్‌ప్లేను, 90Hz రిఫ్రెష్ రేట్ తో అందిస్తారని సమాచారం. పైభాగంలో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉండనుంది. అలాగే IP54 రేటింగ్ తో నీరు, దూళి నుంచి రక్షణ కల్పించే అవకాశం ఉంది. ఇక మొబైల్ మందం కేవలం 7.5mmగా ఉండనుందని లీకులు చెబుతున్నాయి.

Gold Rates: దడ పుట్టిస్తున్న బంగారం, వెండి ధరలు.. నేడు తులంపై రూ. 900 పెరిగిన గోల్డ్ ధర

ప్రాసెసర్:
ఈ ఫోన్‌లో 6nm Exynos 1330 చిప్‌సెట్ ను ఉపయోగించే అవకాశముంది. అదేవిధంగా ఈ ఫోన్ Android 15 ఆధారిత One UI 7తో రావచ్చని, ఆరు సంవత్సరాల OS తోపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ గ్యారంటీ ఇస్తారని సమాచారం.

కెమెరా స్పెసిఫికేషన్స్:
ఇక కెమెరా విషయానికి వస్తే ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50MP ప్రధాన సెన్సార్ (OIS‌తో), 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మాక్రో కెమెరాలతో పాటు.. ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉండనుంది.

LPG Price Reduction: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్‌పీజి గ్యాస్ సిలిండర్ల ధర..

బ్యాటరీ & ఛార్జింగ్:
ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీని, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించే అవకాశముంది. ప్రస్తుతం మొబైల్ లాంచ్ తేదీపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా, రాబోయే సెప్టెంబర్ 4 శాంసంగ్ గెలాక్సీ ఈవెంట్‌లో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.