
Oppo A6 Max: ఒప్పో (Oppo) తాజాగా A6 Max స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ 7,000mAh భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిచనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, వైట్ రంగులలో లాభయం కానుంది. మరి ఈ క్రేజీ స్మార్ట్‌ఫోన్ వివరాలను ఒకసారి చూసేద్దామా..
డిస్‌ప్లే, ప్రాసెసర్:
Oppo A6 Max లో 6.8-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 1,280×2,800 పిక్సెల్స్ గా ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. డిస్‌ప్లే క్రిస్టల్ షీల్డ్ గ్లాస్‌తో రక్షణ పొందింది. ఇక ఫోన్ లో Snapdragon 7 Gen 3 ప్రాసెసర్, 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ కలిగి ఉంది.
కెమెరా:
Oppo A6 Max లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో ప్రధాన కెమెరా 50 MP కాగా, సెకండరీ కెమెరా 2 MP మాత్రమే ఉంది. ఇక ఫ్రంట్ కెమెరాగా 32MP మొబైల్ ను అందించారు.
SCO Summit: ట్రెండింగ్‌గా మారిన ఐదు ఫొటోలు.. ఏవేవంటే..!
బ్యాటరీ:
ఈ ఒప్పో A6 Max మొబైల్ 7,000mAh బ్యాటరీతో వస్తుంది. దీనికి 80W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఈ మొబైల్ 7.7mm పొడవు, 198g బరువు కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రిజిస్టెంట్ ను కలిగి ఉంది. ఇందులో చుప్పుకోతగ్గ మరో ఫీచర్ ఇందులో 5,200 sq mm వెపర్ చాంబర్ (VC) కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం డ్యూయల్-బ్యాండ్ GPS, Beidou, NFC అందుబాటులో ఉన్నాయి.
ధర:
Oppo A6 Max ధర చైనాలో CNY 1,599 అంటే రూ. 23,500గా ఉంది. ఇందులో కేవలం 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ లభ్యమవుతోంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ బంగ్లాదేశ్‌లో MobileDokan వెబ్‌సైట్‌లో ‘Coming Soon’ గా లిస్టింగ్ అయింది. చూడాలిమరి ఈ మొబైల్ ను భారత్ లో ఎప్పుడు లాంచ్ చేయనుందో.
Alimony: 73 వేల జీతం పొందుతున్న భార్య.. భర్త నుంచి భరణం కోరగా.. షాకిచ్చిన హైకోర్టు