Oppo Find X9: ఒప్పో తన కొత్త ఫ్లాగ్‌షిప్ Find X9 తో మరోసారి హడావుడి చేయబోతోంది. గత మోడల్ Find X8 లోని సర్కిల్ ఆకారపు కెమెరా డెకోకు బదులుగా, ఈసారి ఎడమ పైభాగంలో చతురస్రాకార కెమెరా మాడ్యూల్‌ను తీసుకొస్తోంది. దీని వల్ల ఫోన్ లుక్ మరింత స్టైలిష్‌గా, క్లాసీగా ఉండబోతోందని లీక్‌లు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా Danxia Original Color లెన్స్ స్టాండర్డ్‌గా రాబోతోందని సమాచారం.
శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. Samsung Galaxy S25 FE స్పెక్స్ లీక్!
తాజాగా గీక్ బెంచ్ లిస్టింగ్‌లో కనిపించిన Find X9 (మోడల్ నంబర్: OPPO CPH2791), Dimensity 9500 SoC, 16GB RAM, Android 16 ఆధారిత ColorOS 16తో రాబోతోందని వెల్లడైంది. దీనిలో 1 x 4.21GHz ప్రైమ్ కోర్, 3 x 3.50GHz పనితీరు కోర్లు, 4 x 2.70GHz కోర్లు ఉన్నాయన్నది సమాచారం. ఇక ఈ మొబైల్ లో GPU గా Mali-G1 Ultra MC12 వాడనున్నారు. అంతేకాదు, 6.59-అంగుళాల 1.5K 120Hz OLED డిస్‌ప్లేతోపాటు గరిష్టంగా 512GB స్టోరేజ్ కూడా అందించనున్నారు.
IP69 రేటింగ్, 7,000mAh భారీ బ్యాటరీతో Realme 15T లాంచ్.. ప్రీ-ఆర్డర్ చేస్తే ఆఫర్స్ కూడా బాసు!
ఒప్పో Find X9 ఇప్పటి వరకు వచ్చిన అత్యంత శక్తివంతమైన స్టాండర్డ్ ఫ్లాగ్‌షిప్ అవుతుందని తెలిపారు. దీని హైలైట్స్‌లో లాంగెస్ట్ బ్యాటరీ లైఫ్, పవర్‌ఫుల్ ఇమేజింగ్ సిస్టమ్, కొత్త టైడల్ ఇంజిన్, స్మూత్ ColorOS 16, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్, IP66+68+69 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్ ఉన్నాయి. అంతేకాకుండా, Hasselblad తో భాగస్వామ్యం చేసుకొని ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా అందించనుంది. మొత్తం మీద Find X9 స్మార్ట్‌ఫోన్ డిజైన్, కెమెరా, పనితీరు, సెక్యూరిటీ, డ్యూరబిలిటీ అన్నింటిలోనూ కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతుందని అనుకోవచ్చు.