Dolby Vision 2: ప్రపంచ ప్రఖ్యాత ఆడియో, వీడియో టెక్నాలజీ బ్రాండ్ డాల్బీ లాబొరేటరీస్ (Dolby Laboratories) తన ప్రీమియం డిస్‌ప్లే టెక్నాలజీకి కొత్త అప్‌గ్రేడ్‌ను పరిచయం చేసింది. అదే డాల్బీ విజన్ 2 (Dolby Vision 2). ఇది సినిమాలు, టీవీ షోలు, లైవ్ స్పోర్ట్స్, గేమింగ్ కంటెంట్ అన్నింటిలోనూ మరింత క్లారిటీ, కలర్ ప్రిసిషన్, రియలిస్టిక్ అనుభవం అందించడానికి రూపొందించబడింది.
ఈ కొత్త డాల్బీ విజన్ 2 ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో ‘డాల్బీ ఇమేజ్ ఇంజిన్’ (Image Engine) తో విజువల్స్ మరింత కచ్చితంగా, షార్ప్‌గా కనిపిస్తాయి. ఇందులోని AI పవర్డ్ కంటెంట్ ఇంటెలిజెన్స్ (AI-Powered Content Intelligence) ప్రతి సీన్‌ని ఆటోమేటిక్‌గా ఆప్టిమైజ్ చేసి, వీవింగ్ ఎన్విరాన్‌మెంట్‌కి తగ్గట్టు సెట్టింగ్స్ సర్దుతుంది. ఇక ఇందులోని ప్రిసిషన్ బ్లాక్ టెక్నాలజీ (Precision Black Technology) వల్ల డార్క్ సీన్స్‌లో కూడా డిటైల్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే క్రియేటర్ ఉద్దేశ్యాన్ని మాత్రం మార్చదు.
కొత్త కలర్ ఆప్షన్లు, ప్రీమియమ్ ఇంటీరియర్‌తో మరింత స్టైలిష్‌గా వచ్చేసిన Honda Elevate 2025!
అలాగే ఇందులోని అడాప్టివ్ లైట్ సెన్స్ (Adaptive Light Sense) ద్వారా గదిలోని లైటింగ్‌ని బట్టి బ్రైట్‌నెస్, కాన్‌ట్రాస్ట్ ఆటోమేటిక్‌గా సెట్ అవుతాయి. ఇక స్పోర్ట్స్, గేమింగ్ కోసం ప్రత్యేకంగా మోషన్ కంట్రోల్, కలర్ ఆప్టిమైజేషన్ ఇవ్వబడింది. అలాగే, అడ్వాన్స్డ్ టోన్ మ్యాపింగ్ (Advanced Tone Mapping) వలన హైలైట్స్ మరింత బ్రైట్‌గా, షేడ్స్ లోతుగా, కలర్స్ రిచ్‌గా కనబడతాయి. అదేవిధంగా ఇందులోని ఆథెంటిక్ మోషన్ కంట్రోల్ (Authentic Motion Control) వల్ల సీన్స్‌లో స్టట్టర్ తగ్గి, సహజమైన సినిమాటిక్ ఫ్లో లభిస్తుంది.
ఈ కొత్త డాల్బీ విజన్ 2 రెండు విభాగాల్లో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటిది డాల్బీ విజన్ 2 మ్యాక్స్ (Dolby Vision 2 Max). ఇది హై-ఎండ్ టెలివిజన్ల కోసం, ప్రీమియం డిస్‌ప్లే హార్డ్‌వేర్ సామర్థ్యాన్ని ఫుల్‌గా ఉపయోగించుకునేలా రూపొందించారు. అలాగే ఇక రెండో విషయానికి వస్తే.. డాల్బీ విజన్ 2 (Dolby Vision 2). ఇది స్టాండర్డ్ టీవీల కోసం, నెక్స్ట్-జెన్ ఇమేజ్ ఇంజిన్ మరియు AI ఆధారిత మెరుగుదలలతో రూపుదిద్దుకుంది.
అటు ఫీచర్లు, ఇటు సేఫ్టీతో కొత్త Maruti Suzuki Victoris సంచలనం.. 5-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్‌తో పాటు!
మొదటగా హైసెన్స్ (Hisense) కామపీనీ తమ కొత్త RGB-MiniLED టీవీల్లో ఈ డాల్బీ విజన్ 2 అందించనుంది. వీటిలో మీడియాటెక్ పెంటానిక్ 800 చిప్ (MiraVision™ Pro PQ ఇంజిన్‌తో) వాడబడుతోంది. ఈ చిప్ డాల్బీ విజన్ 2కి సపోర్ట్ చేసే తొలి చిప్‌గా నిలిచింది. అలాగే CANAL+ కూడా సపోర్ట్ అందించనున్నట్లు ధృవీకరించింది. అయితే, లాంచ్ డేట్స్ త్వరలో ప్రకటించనున్నారు.