Leading News Portal in Telugu

Itel A90 Limited Edition Smartphone Launched in India.. Price, Features, Specs are


  • A90 లిమిటెడ్ ఎడిషన్ (Itel A90 Limited Edition) స్మార్ట్‌ఫోన్‌ పరిచయం
  • మిలిటరీ గ్రేడ్ MIL-STD-810H సర్టిఫికేషన్‌తో పాటు IP54 రేటింగ్
  • రూ.6,399ల ప్రారంభ ధరతో.

Itel A90 Limited Edition: ఐటెల్ (Itel) తాజాగా A90 లిమిటెడ్ ఎడిషన్ (Itel A90 Limited Edition) స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త వెర్షన్‌కి మిలిటరీ గ్రేడ్ MIL-STD-810H సర్టిఫికేషన్‌తో పాటు IP54 రేటింగ్ కలిగి ఉంది. అంటే ఇది ధూళి, నీటి చుక్కలు, పడిపోవడాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇదివరకు విడుదలైన స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే.. చాలా ఫీచర్లు ఒకేలా ఉన్నా, కొత్త ఎడిషన్ మాత్రం కాస్త ఎక్కువ డ్యూరబిలిటీతో ప్రత్యేకత కలిగి ఉంది.

Jio Anniversary celebration: 9 ఏళ్లు పూర్తి చేసుకున్న జియో.. యూజర్ల కోసం బంపరాఫర్లు.. ఫ్రీ అన్ లిమిటెడ్ 5G డేటా!

ధరలు:
ఈ కొత్త Itel A90 Limited Edition స్మార్ట్‌ఫోన్ 3GB+64GB వేరియంట్‌ ధర రూ.6,399కాగా, 4GB+64GB వేరియంట్‌ రూ.6,899గా నిర్ణయించారు. ఇక ఈ మొబైల్ అరోరా బ్లూ, స్పేస్ టైటానియం, స్టార్ లిట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఈ మొబైల్ కేవలం ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. స్టాండర్డ్ మోడల్‌ లోని 4GB+64GB ధర రూ.6,499గా, 4GB+128GB ధర రూ.6,999గా ఉంది.

Image (1)

ఫీచర్లు:
ఐటెల్ A90 లిమిటెడ్ ఎడిషన్‌లో 6.6 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. స్క్రీన్‌లో “డైనమిక్ బార్” ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఇది Unisoc T7100 ప్రాసెసర్ ద్వారా నడుస్తుంది. ఆండ్రాయిడ్ 14 Go ఎడిషన్ ఆధారంగా ఐటెల్ OS 14తో వస్తుంది. ఈ ఫోన్‌లోని Aivana 2.0 AI అసిస్టెంట్ వినియోగదారులకు డాక్యుమెంట్లను అనువదించడం, గ్యాలరీలోని ఫోటోలు అర్థం చేసుకోవడం, వాట్సాప్ కాల్స్ చేయడం, కష్టమైన గణిత సమస్యలు పరిష్కరించడం వంటి అనేక స్మార్ట్ పనులను చేయగలదు. అంతేకాకుండా, DTS ఆడియో టెక్నాలజీ శబ్దాన్ని మెరుగుపరుస్తుంది.

GST Council: చౌకగా మారనున్న చికిత్స.. ఈ మందులపై నో జీఎస్టీ..

Image

ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇందులో వెనుక భాగంలో 13MP మెయిన్ కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాని అందించారు. ఇక పవర్ కోసం 5,000mAh బ్యాటరీ, 15W వైర్డ్ చార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తుంది. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంది.