Leading News Portal in Telugu

Zebronics Juke Bar 9920 Launched.. First 900W RMS Dolby Atmos Soundbar details are


Zebronics Juke Bar 9920: జీబ్రానిక్స్ తన సౌండ్‌బార్ లైనప్ లో భాగంగా మార్కెట్‌లోకి కొత్తగా Juke Bar 9920ని లాంచ్ చేసింది. ఇది దేశంలోనే మొదటి 900W RMS ఔట్‌పుట్ ఇచ్చే సౌండ్‌బార్‌గా రికార్డు సృష్టించింది. దీని తోడు 12-అంగుళాల వైర్‌లెస్ సబ్‌వూఫర్ ఉండటంతో, హోమ్ ఎంటర్టైన్మెంట్ సెటప్‌లకు మరింత బాస్ అనుభవాన్ని అందిస్తుంది. జ్యూక్ బార్ 9920లో 7.1.2 సరౌండ్ సౌండ్ తో పాటు Dolby Atmos, ZEB AcoustiMax Multi-Dimensional ఆడియో టెక్నాలజీలు ఉన్నాయి. తొమ్మిది డ్రైవర్ల ద్వారా శబ్దాన్ని ప్రసారం చేస్తూ, క్లీన్ హైస్, బ్యాలెన్స్‌డ్ మిడ్‌లు, పవర్‌ఫుల్ బాస్‌ను వినియోగదారులకు అందిస్తుంది.

Stock Market: జీఎస్టీ ఊరటతో స్టాక్ మార్కెట్‌కు ఉత్సాహం.. భారీ లాభాల్లో సూచీలు

ఈ సౌండ్‌బార్‌లో Bluetooth v5.3, eARC, Optical IN, USB, AUX వంటి విభిన్న కనెక్టివిటీ ఆప్షన్లు లభిస్తున్నాయి. అదనంగా, LED డిస్ప్లే, వాల్ మౌంటబుల్ డిజైన్ వలన ఇంటీరియర్‌కు స్టైలిష్ లుక్ ఇవ్వడమే కాకుండా, వినియోగదారులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది MP3 ఫైల్ సపోర్ట్ చేస్తుంది మరియు 32GB వరకు USB మెమరీ సపోర్ట్ కూడా కలిగి ఉంది.

ఆడియో పనితీరు విషయానికి వస్తే, 900W RMS ఔట్‌పుట్ (సౌండ్‌బార్ 540W + సబ్‌వూఫర్ 360W)ను అందిస్తుంది. ఈ సెట్‌లో మొత్తం 9 డ్రైవర్లు ఉన్న సౌండ్‌బార్, అలాగే 12-అంగుళాల వైర్‌లెస్ సబ్‌వూఫర్ లభిస్తుంది. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 45Hz నుంచి 20kHz వరకు ఉండడంతో, వినియోగదారులు డీప్ బాస్‌తో పాటు స్పష్టమైన హైస్, మిడ్‌లను ఆస్వాదించవచ్చు.

Srikakulam: చిల్లంగి అనుమానంతో.. దారుణంగా కొట్టి చంపేశారు…

డిజైన్ పరంగా, సౌండ్‌బార్ బరువు 4.1kg, సబ్‌వూఫర్ బరువు 12.4kg, మొత్తంగా 16.5kg ఉంటుంది. ప్యాకేజీతో పాటు సౌండ్‌బార్, సబ్‌వూఫర్, రిమోట్, ఇన్‌పుట్ కేబుల్, HD కేబుల్, వాల్ మౌంట్ బ్రాకెట్, పవర్ కార్డులు, వైర్‌లెస్ మైక్రోఫోన్ కూడా లభిస్తాయి. దీన్ని కొనుగోలు చేసిన వినియోగదారులకు 1 సంవత్సరం వారంటీ లభిస్తుంది. జీబ్రానిక్స్ జ్యూక్ బార్ 9920ని వినియోగదారులు ప్రారంభ ధర రూ.32,999కి కొనుగోలు చేయవచ్చు. ఇది అమెజాన్, ఫ్లిప్ కార్ట్, అలాగే జీబ్రానిక్స్ (Zebronics) అధికారిక ఆన్‌లైన్ స్టోర్లో అందుబాటులో ఉంటుంది.