Leading News Portal in Telugu

Samsung Galaxy Unpacked 2025 Live Today.. Galaxy S25 FE, Tab S11 Series Launch Details


Samsung Galaxy Unpacked event 2025: టెక్ ప్రియులు, శాంసంగ్ లవర్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్ మరి కొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఇప్పటికే ఈ ఈవెంట్‌లో ప్రిమియం AI టాబ్లెట్లు, గెలాక్సీ S25 సిరీస్ లో కొత్త మొబైల్ లాంచ్ అవుతాయని టీజ్ చేసింది. దీంతో గెలాక్సీ Tab S11 సిరీస్, గెలాక్సీ S25 FE ఈవెంట్ ప్రధాన ఆకర్షణలుగా ఉండబోతున్నాయన్న అంచనాలు మొదలయ్యాయి.

AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించిన సిట్.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం..!

ఈ ఈవెంట్ నేడు (సెప్టెంబర్ 4)న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది పూర్తిగా వర్చువల్ ఈవెంట్ మాత్రమే. వినియోగదారులు శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ లేదా యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్‌స్ట్రీమ్ ను వీక్షించవచ్చు. ఈసారి శాంసంగ్ ఈవెంట్‌ను “గెలాక్సీ AI అనుభవానికి కొత్త గేట్‌వే” (New gateway to the latest Galaxy AI experience)గా మార్కెట్ చేస్తోంది. ఇక అందిన కొన్ని లీక్స్ ప్రకారం, గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్, అలాగే గెలాక్సీ Tab S11, Tab S11 Ultra ఈవెంట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఇక రాబోయే శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 6.7-అంగుళాల Dynamic AMOLED 2X స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, Exynos 2400 చిప్‌సెట్, 8GB ర్యామ్, ట్రిపుల్ రియర్ కెమెరాలో భాగంగా 50MP ప్రైమరీ + 12MP అల్ట్రావైడ్ + 8MP 3x టెలిఫోటో, ఫ్రంట్ కెమెరాగా 12MP కెమెరా, 4,900mAh బ్యాటరీ, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, Android 15 ఆధారంగా One UI 7 లు ఉండనున్నాయి. ఈ మొబైల్ ఐసీ బ్లూ , జెట్ బ్లాక్, నేవీ, వైట్ రంగులలో లభిస్తుంది.

Wobble Maximus: అతిపెద్ద స్మార్ట్ టీవీ.. 116.5-అంగుళాల డిస్‌ప్లేతో.. థియేటర్ లాంటి ఎక్స్‌పీరియన్స్‌

ఇక శాంసంగ్ గెలాక్సీ Tab S11 విషయానికి వస్తే.. ఇందులో Exynos 9400 చిప్‌సెట్, Mali-G925 GPU ఉండనున్నాయి. అదే Tab S11 Ultraలో 14.6-అంగుళాల Dynamic AMOLED 2X డిస్‌ప్లే, 12GB RAM, 256GB స్టోరేజ్, డ్యూయల్ రియర్ కెమెరాలు 13MP + 8MP అల్ట్రావైడ్, ఫ్రంట్‌లో డ్యూయల్ 12MP కెమెరాలు, 11,600mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, S Pen సపోర్ట్ ఉండనున్నాయి. ఇక వీటితోపాటు కొన్ని రూమర్స్ ప్రకారం, శాంసంగ్ గెలాక్సీ Tab S10 Liteని కూడా పరిచయం చేయవచ్చని సమాచారం.