Redmi 15C 4G: రెడ్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ Redmi 15C 4Gను గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేసింది. గత ఏడాదిలో వచ్చిన Redmi 14Cకి ఇది అప్డేటెడ్ గా వచ్చింది. ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల HD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. ఇందులో ప్రాసెసర్‌గా MediaTek Helio G81-Ultra చిప్‌సెట్‌ను ఉపయోగించారు. మొబైల్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ లెన్స్‌తో డ్యుయల్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే, ఫోన్‌కి IP64 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ కు 6,000mAh భారీ బ్యాటరీతో పాటు 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు.
Redmi 15C 4G 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 179 డాలర్స్ అంటే రూ.15,900 నుంచి ప్రారంభమవుతుంది. వీటితోపాటు ఈ మొబైల్ 4GB + 256GB, 6GB + 128GB మోడళ్లలో కూడా అందుబాటులో ఉంది. హైఎండ్ వేరియంట్ 8GB + 256GB మోడల్ ధర 229 డాలర్స్ అంటే రూ.20,300గా ఉంది. ఇక ఈ కొత్త మొబైల్ మూన్ లైట్ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్, మింట్ గ్రీన్, ట్విలైట్ ఆరంజ్ వంటి రంగులలో అందుబాటులో ఉన్నాయి. అయితే భారత్‌లో ఎప్పుడు లాంచ్ చేస్తారో ఇంకా ప్రకటించలేదు.
ఈ డివైస్ HyperOS 2 ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రన్ అవుతుంది. ఇక మొబైల్ డిస్ప్లే 6.9 అంగుళాల HD+ LCD స్క్రీన్ (720×1,600px), 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 810 nits పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంది. అంతేకాకుండా ఇందులో TÜV Rheinland సర్టిఫికేషన్ లభించింది. ఇక ప్రాసెసింగ్ కోసం MediaTek Helio G81-Ultra ఆక్టా-కోర్ ప్రాసెసర్, Mali-G52 MC2 GPU, 256GB వరకు స్టోరేజ్ అందించారు. AI ఫీచర్లలో సర్కిల్ టు సెర్చ్, జెమినీ లాంటి ప్రత్యేక ఆప్షన్లు ఉన్నాయి.
కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ సెన్సార్‌తో డ్యుయల్ రియర్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాగా 8MP ను అందించారు. వీటిలో అల్ట్రా HD మోడ్, పోర్ట్రైట్, సెల్ఫీ బ్యూటీ మోడ్ వంటి ఫీచర్లు సపోర్ట్ చేస్తాయి. ఇక కనెక్టివిటీ విషయంలో Wi-Fi, బ్లూటూత్ 5.4, 4G LTE, NFC, GPS, GLONASS, Galileo, BeiDou, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB Type-C పోర్ట్ అందించారు. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు AI పేస్ అన్ లాక్ కూడా ఉంది. ఫోన్ బరువు 205 గ్రాములు కాగా, మందం 7.99mm మాత్రమే. మొత్తంగా చూస్తే.. పెద్ద స్క్రీన్, భారీ బ్యాటరీ, కొత్త AI ఫీచర్లతో Redmi 15C 4G మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ కేటగిరీలో బెస్ట్ ఆప్షన్‌గా నిలువనుంది.