Leading News Portal in Telugu

TECNO POVA Slim 5G Launched.. Ultra-Thin 5.95mm Phone with Dynamic Light Design and Military-Grade Protection


  • కేవలం 5.95mm మందం, 156g బరువు – ఇప్పటివరకు అత్యంత సన్నని కర్వ్‌డ్ స్క్రీన్ 5G ఫోన్
  • 6.78-అంగుళాల 1.5K 144Hz 3D కర్వ్‌డ్ AMOLED డిస్ప్లే – Gorilla Glass 7i రక్షణతో
  • డాల్బీ ఆట్మాస్ సపోర్ట్‌తో స్పీకర్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్.

TECNO POVA Slim 5G: మొబైల్స్ తయారీ సంస్థ టెక్నో (TECNO) స్లిమ్ Slim సిరీస్ లో భాగంగా TECNO POVA Slim 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6.78 అంగుళాల 1.5K 144Hz 3D కర్వ్‌డ్ AMOLED డిస్ప్లే కలిగి ఉంది. ఈ మొబైల్ లో MediaTek Dimensity 6400 వంటి మెరుగైన ప్రాసెసర్, 8GB RAM (అదనంగా 8GB వర్చువల్ RAM) సపోర్ట్‌తో వస్తుంది. ఈ మొబైల్ కేవలం 5.95mm మందం కలిగిన అత్యంత సన్నని 5G కర్వ్‌డ్ స్క్రీన్ ఫోన్ గా కంపెనీ పేర్కొంది.

ఫోల్డబుల్ టెక్నాలజీలో కొత్త మైలురాయి.. కొత్త Huawei Mate XTs ట్రై-ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్!

Image (6)

ఈ ఫోన్ బరువు కేవలం 156 గ్రాములు మాత్రమే ఉంది. దీనికి కారణం ఇందులో Dynamic Mood Light Design అనే ప్రత్యేక ఫీచర్ ను వినియోగించారు. ఇది కాల్స్, నోటిఫికేషన్లు లేదా యూజర్ మూడ్‌కు అనుగుణంగా డైనమిక్‌గా లైటింగ్ ఎఫెక్ట్స్ ను కూడా ఇస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ లో 5G+ Carrier Aggregation, 4×4 MIMO, Dual SIM Dual Active, TÜV Rheinland High Network Performance సర్టిఫికేషన్‌లతో అప్డేటెడ్ నెట్‌వర్క్ పనితీరును అందిచనుంది.

Image (5)

ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఇందులో ఆండ్రాయిడ్ 15 ఆధారంగా HiOS 15 మీద రన్ అవుతుంది. టెక్నో సంబంధిత Ella AI అసిస్టెంట్ తోపాటు.. AI కాల్ అసిస్టెంట్, AI రైటింగ్, AI ఇమేజ్ ఎడిటింగ్, Circle to Search, ప్రైవసీ బ్లర్రింగ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక కెమెరా సెటప్‌లో.. వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా (2K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో), ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

Ross Taylor: రిటైర్మెంట్‌పై రాస్ టేలర్ యూటర్న్.. కాకపోతే, ఈసారి ఆ దేశం తరుపున!

Image (4)

TECNO POVA Slim 5Gలో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డాల్బీ ఆట్మాస్ సపోర్ట్‌తో బాటమ్-పోర్టెడ్ స్పీకర్స్ ఉన్నాయి. అంతేకాకుండా దీనికి MIL-STD 810H మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కూడా లభిస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ సన్నని ఫోన్‌లో ఏకంగా 5160mAh బ్యాటరీని అందించారు. దీనికి 45W ఫాస్ట్ చార్జింగ్ సప్పోర్ట్ తో అందించారు. ధర పరంగా చూస్తే.. 8GB + 128GB వేరియంట్ ఒక్కటే లాంచ్ కాగా దీని ధర రూ. 19,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ స్కై బ్లూ, స్లిమ్ వైట్, కూల్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగా మొబైల్ సెప్టెంబర్ 8 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.