Leading News Portal in Telugu

Samsung Galaxy Tab S11 & S11 Ultra Launched with IP68, AMOLED 120Hz Displays and New S Pen


  • IP68 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్, Wi-Fi 6E/7, 5G, 4 స్పీకర్లు
  • Tab S11 స్పెక్స్ – 12GB RAM, 128/256/512GB స్టోరేజ్
  • 13MP రియర్, 12MP ఫ్రంట్, 8,400mAh బ్యాటరీ
  • Tab S11 Ultra స్పెక్స్ – 12/16GB RAM, 256GB/512GB/1TB స్టోరేజ్
  • 13MP+8MP UW రియర్, 12MP ఫ్రంట్, 11,600mAh బ్యాటరీ.

Samsung Galaxy Tab S11, S11 Ultra: శాంసంగ్ కొత్తగా గెలాక్సీ ట్యాబ్ S11 సిరీస్‌ను అధికారికంగా ఆన్‌లైన్ ఈవెంట్‌లో లాంచ్ చేసింది. ఇందులో గెలాక్సీ ట్యాబ్ S11, గెలాక్సీ ట్యాబ్ S11 అల్ట్రా రెండు మోడల్స్ లభిస్తున్నాయి. ఇవి వరుసగా 11 అంగుళాలు, 14.6 అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లేలు ఉంటాయి. ఈ రెండూ MediaTek Dimensity 9400+ 3nm ప్రాసెసర్ తో పనిచేస్తాయి. ఇది గత మోడల్ కంటే 33% NPU, 24% CPU, 27% GPU పెర్ఫార్మెన్స్ మెరుగుదలను అందించనున్నాయి.

అత్యంత సన్నగా రూపొందించిన Tab S11 Ultra కేవలం 5.1mm మందంతో వస్తుండగా, 5.2mm బార్డర్లతో ప్రీమియం ఫినిష్ అందిస్తుంది. ఇందులో Dynamic AMOLED 2X డిస్‌ప్లేలు గరిష్టంగా 1600 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తాయి. ఇక ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణ కొత్త S Pen. ఇది కోన్ షేప్ పెన్‌టిప్‌తో మెరుగైన కంట్రోల్ ఇస్తుంది. అలాగే హెక్సాగనల్ డిజైన్ చేతిలో సరిపడేలా రూపొందించబడింది. ఇది Quick Tools డ్రాయింగ్ లేదా ఎడిటింగ్ సమయంలో వెంటనే ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఇస్తుంది. అలాగే, స్టిక్కీ నోట్ ద్వారా వేర్వేరు యాప్‌లకు మారాల్సిన అవసరం లేకుండా నోట్స్ రాయవచ్చు.

Samsung Bespoke AI Washer Dryer: బెస్పోక్ ఏఐ వాషింగ్ మెషిన్ విడుదల.. హైటెక్ ఫీచర్లు.. 70% విద్యుత్ ఆదా.. ధర ఎంతంటే?

ఇక కొత్త Samsung DeX Extended Mode ద్వారా Tab S11 సిరీస్‌ను బయట మానిటర్‌కు కనెక్ట్ చేస్తే.. డ్యూయల్ స్క్రీన్ సెటప్ లాగా పని చేస్తుంది. ఒకేసారి రెండు స్క్రీన్‌లపై DeX నడుస్తూ, వర్క్‌స్పేస్‌ను నాలుగు వేర్వేరు కస్టమైజ్డ్ సెట్ చేసుకోవచ్చు. Tab S11లో 11 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 12GB RAM, 128GB/256GB/512GB స్టోరేజ్ ఆప్షన్లు, 13MP రియర్ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా, 8,400mAh బ్యాటరీ (45W ఫాస్ట్ ఛార్జింగ్) లభిస్తాయి. ఇక Tab S11 Ultraలో 14.6 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 12GB/16GB RAM, 256GB/512GB/1TB స్టోరేజ్ వేరియంట్లు, 13MP + 8MP అల్ట్రా వైడ్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 12MP ఫ్రంట్ కెమెరా, 11,600mAh బ్యాటరీకి 45W ఫాస్ట్ ఛార్జింగ్ అందుబాటులో ఉన్నాయి.

ఈ రెండు టాబ్లెట్‌లు Android 16తో పాటు One UI 8పై రన్ అవుతాయి. అదనంగా IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, Wi-Fi 6E/7, 5G సపోర్ట్, 4 స్పీకర్ల వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇక ధరల విషయానికి వస్తే, Galaxy Tab S11 Wi-Fi మోడల్ ధరలు USD 799.99 (రూ.70,510) నుంచి ప్రారంభమవుతాయి. 5G మోడల్ ధర EUR 1049 (రూ.1,07,725) నుంచి మొదలవుతుంది. Tab S11 Ultra Wi-Fi మోడల్ ధర USD 1,199.99 (రూ.1,05,770) నుంచి ప్రారంభమవుతుండగా, 5G మోడల్ EUR 1489 (సుమారు రూ.1,52,814) నుంచి లభిస్తుంది. ఈ రెండు టాబ్లెట్‌లు ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. ఐయితే, భారత్‌లో ముందస్తు రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

7 ఏళ్ల అప్‌డేట్ హామీ, Exynos 2400 చిప్‌సెట్‌తో Samsung Galaxy S25 FE వచ్చేసిందోచ్..!