- Exynos 2400 ప్రాసెసర్, Xclipse 940 GPU
- 4,900mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్
- IP68 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్
- స్టీరియో స్పీకర్స్, డాల్బీ ఆట్మాస్ సపోర్ట్
- 7 ఏళ్ల Android & సెక్యూరిటీ అప్‌డేట్లు.
Samsung Galaxy S25 FE: శాంసంగ్ Galaxy S25 సిరీస్‌లో కొత్తగా Galaxy S25 FE స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ S25 FE (Samsung Galaxy S25 FE )ను కంపెనీ మంచి స్పెసిఫికేషన్లు, అప్‌గ్రేడ్ ఫీచర్లతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉండి, 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు అందించబడాయి. స్క్రీన్ రక్షణ కోసం Gorilla Glass Victus+ ఇచ్చారు.
ఇక ఇందులో ప్రాసెసర్‌గా Exynos 2400 చిప్‌సెట్‌తో పాటు Xclipse 940 GPU కలిగి ఉంది. అలగే ఈ ఫోన్‌లో 8GB RAM తో పాటు 128GB, 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లు లభ్యమవుతున్నాయి. ప్రాసెసర్ విషయానికి వస్తే, ఈసారి Exynos 2400 SoC ను ఉపయోగించడంతో.. గత మోడల్‌తో పోలిస్తే 10% పెద్ద వెపర్ చాంబర్ ఇచ్చి, హీటింగ్ సమస్యను తగ్గించి పనితీరును ఎక్కువ సేపు ఉంచేలా చేశారు.
కేవలం 5.95mm మందం, మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, డైనమిక్ లైట్ డిజైన్‌తో TECNO POVA Slim 5G లాంచ్!
సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా One UI 8 పై నడుస్తుంది. దీని కోసం 7 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు అందుతాయని శాంసంగ్ హామీ ఇస్తోంది. అంతేకాకుండా ఇందులో జెమినీ లైవ్, నౌ బార్, సర్కిల్ టు సెర్చ్, జెనెరేటివ్ ఎడిట్, ఆడియో రేజర్ వంటి AI ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇక డిజైన్ పరంగా ఈ ఫోన్ గ్లాస్ బ్యాక్, మెరుగుపరచిన ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ తో వచ్చింది. IP68 రేటింగ్ కలిగి ఉండటంతో ఇది డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కలిగి ఉంది.
కొత్త Galaxy S25 FE స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ లెన్స్, 8MP టెలిఫోటో కెమెరా (OIS, 3X ఆప్టికల్ జూమ్) ఇచ్చారు. ఇందులో ఫ్రంట్ కెమెరాగా 12MP సెల్ఫీ కెమెరా అందించబడింది. అలాగే మొబైల్ పవర్ కోసం 4,900mAh బ్యాటరీ అందించారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఇందులో స్టీరియో స్పీకర్స్, డాల్బీ ఆట్మాస్ సపోర్ట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఫోల్డబుల్ టెక్నాలజీలో కొత్త మైలురాయి.. కొత్త Huawei Mate XTs ట్రై-ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్!
చివరగా ధరల విషయానికి వస్తే 128GB మోడల్ ధర USD 649.99 (రూ. 57,300) కాగా, 256GB మోడల్ ధర USD 709.99 (రూ.62,600)గా ఉంది. అదే యూరప్ మార్కెట్లో 512GB మోడల్ 929 యూరోలు (సుమారు రూ. 95,300)కి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐసీబ్లూ, జెట్ బ్లాక్, నేవీ, వైట్ రంగుల్లో లభించనుంది. లాంచ్ రోజు నుంచే సేల్ ప్రారంభమవుతుండగా.. మొబైల్ కొనుగోలు చేసిన యూజర్లకు గూగుల్ AI ప్రో ప్లాన్‌లో ఆరు నెలల ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా అందించబడుతుంది.